Lockdown break | చైనాలో కఠిన కొవిడ్ ఆంక్షలు.. కంచె దూకి పారిపోతున్న ఐఫోన్ ఉద్యోగులు.. వీడియో
Lockdown break | చైనాలో కొవిడ్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటుండటంతో అక్కడి ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జెంగ్జౌలోని ఫ్యాక్టరీ కంచె దూకి చాలా మంది కార్మికులు పారిపోయారు.
Lockdown break | చైనాలో మళ్లీ కొవిడ్ పంజా విప్పుతున్నది. దాంతో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. నెలల తరబడి ప్రజలు బయటకు రాకుండా ఇండ్లకే పరిమితమయ్యారు. కరోనాకు గురైనవారికి చికిత్స అందించేందుకు జైలు మాదిరి కంటైనర్లను ఏర్పాటు చేశారు. వైరస్ సోకిన వారిని ముట్టుకోకుండా అక్కడి ఉద్యోగులు జాగ్రత్తపడుతున్నారు. కాగా, చాలా రోజులుగా కంపెనీలో ఉండలేక ఐఫోన్ ఉద్యోగులు కంచె దూకి పారిపోతున్నారు. 100కు పైగా కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ఇళ్లకు నడుచుకుంటూ పోతున్నారు.
చైనాలో యాపిల్ కంపెనీకి చెందిన అతి పెద్ద అసెంబ్లింగ్ యూనిట్ జెంగ్జౌలో ఉన్నది. ఇక్కడ ఐఫోన్ల అసెంబ్లీ జరుగుతుంది. కొవిడ్ కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం నిర్దేశించిన కఠిన ఆంక్షలను ఐఫోన్ యాజమాన్యం కూడా అమలు చేస్తున్నది. ఫాక్స్‌కాన్‌లో జీరో కొవిడ్ లాక్డౌన్ విధించడంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. నెలలకొద్ది బయటి వాతావరణంలోకి వెళ్లకపోవడంతో మానసికంగా కృంగిపోతున్నట్లు కూడా నివేదికలు చెప్తున్నాయి. దీంతో ఈ అసెంబ్లింగ్ యూనిట్ నుంచి బయటపడేందుకు ఉద్యోగులు దొంగచాటుగా కంచెలు దాటుతున్నారు. కొవిడ్ యాప్ చర్యల నుంచి బయటపడేందుకు 100 కు పైగా కిలోమీటర్ల దూరంలోని తమ సొంతూళ్లకు నడిచి వెళ్తున్నారు.
ఐఫోన్ యూనిట్ కంచె దూకుతున్న కార్మికులు
Workers have broken out of #Apple’s largest assembly site, escaping the Zero #Covid lockdown at Foxconn in #Zhengzhou. After sneaking out, they’re walking to home towns more than 100 kilometres away to beat the Covid app measures designed to control people and stop this. #China pic.twitter.com/NHjOjclAyU
— Stephen McDonell (@StephenMcDonell) October 30, 2022
ఇలా ఎలక్ట్రానిక్ కంచె ఎక్కి బయట దూకుతున్న ఉద్యోగులను రక్షించాలంటూ కోరుతూ బీబీసీ ప్రతినిధి స్టీఫెన్ మెక్‌డోనెల్ ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ యూనిట్లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో చాలా మంది ఉద్యోగులను క్వారంటైన్లో ఉంచి చికిత్స అందించారు. ఎక్కువ కాలం పాటు క్వారంటైన్లో ఉండటంతో ఉద్యోగులు మానసికంగా కృంగిపోయినట్లుగా తెలుస్తున్నది. ఈ యూనిట్లో దాదాపు 3 లక్షల మంది కార్మికులను పనిలో పెట్టుకున్నట్లు సమాచారం. హెనాన్ ప్రావిన్స్ రాజధాని అయిన జెంగ్జౌ నగరంలో గత వారం రోజుల్లో 167 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంలో 97 గా ఉండేది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

