ఎత్తైన కొండ అంచున ఉయ్యాల.. ఊగుతూ పడిన మహిళలు

మాస్కో: ఎత్తైన కొండ అంచున ఏర్పాటు చేసిన ఉయ్యాలలో ఇద్దరు మహిళలు ఊగుతుండగా గొలుసులు ఊడాయి. దీంతో వారిద్దరూ కొండ అంచు నుంచి కింద పడిపోయారు. అయితే అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డారు. రష్యాలోని డాగేస్టాన్లో ఈ ఘటన జరిగింది. ఈ పర్యాటక ప్రాంతంలో 6300 అడుగుల ఎత్తైన కొండ అంచున సులక్ కాన్యన్ను ఏర్పాటు చేశారు. టూరిస్ట్‌లు కొండ అంచు నుంచి కింద ఉన్న లోయ మీదుగా ఉయ్యాల ఊగి థ్రిల్ పొందుతుంటారు.
కాగా, ఇద్దరు మహిళలు చెక్క ఉయ్యాలపై కూర్చోగా ఒక వ్యక్తి దానిని తోశాడు. ఆ ఇద్దరూ తొలుత ఉయ్యాల ఊగి బాగానే ఎంజాయ్ చేశారు. కొంతసేపటి తర్వాత ఆ వ్యక్తి ఉయ్యాలను బలంగా తోశాడు. దీంతో ఉయ్యాల గొలుసులు ఊడటంతో అందులో ఉన్న ఇద్దరు మహిళలు కొండ అంచు నుంచి కిందకు పడిపోయారు. అయితే అంచు కింద ఉన్న చిన్నపాటి చెక్కపై వారిద్దరు పడటంతో స్వల్పంగా గాయపడ్డారు. ఒకవేళ ఉయ్యాల బాగా ఎత్తులో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగి ఉంటే లోయలో పడటంతోపాటు వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేది.
కాగా, ఆ ఉయ్యాలకు తగిన భద్రతా ఏర్పాట్లు లేవని, అందుకే మహిళలు పడిపోయారని డాగేస్టాన్ పర్యాటక మంత్రి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపడంతోపాటు పర్యాటకుల ప్రాణాలకు ఎలాంటి హాని కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఒళ్లు జలదరింపజేసే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

