టెహ్రాన్: ఇటీవల రిలీజైన ఓ ఐస్‌క్రీమ్ యాడ్.. ఇరాన్లో తీవ్ర వివాదం సృష్టించింది. మాగ్నమ్ ఐస్‌క్రీమ్ యాడ్‌లో ఓ మహిళ నటించింది. అయితే ఆ యాడ్‌లో ఆమె తన హిజాబ్‌ను లూజ్‌గా ధరించింది. దీంతో ఇరాన్ మతపెద్దలు ఆ వాణిజ్య ప్రకటనపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ దేశ సాంస్కృతిక శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. అడ్వర్టైజ్మెంట్లు, కమర్షియల్స్‌లో మహిళలను నిషేధించాలని ఆదేశించింది. ఐస్‌క్రీమ్ కంపెనీ డోమినోపై చర్యలు తీసుకోవాలని ఇస్లామిక్ మత గురువులు కోరారు. మహిళల విలువలను కించపరిచేలా ఆ యాడ్ ఉందన్నారు.
The body responsible for “enjoining right and forbidding evil” in the Islamic Republic of Iran has filed a lawsuit against the Iranian ice-cream manufacturer Domino over two controversial commercials, which it says are “against public decency” and “insult women’s values.” pic.twitter.com/Brho4SGZj3
— Iran International English (@IranIntl_En) July 5, 2022