మాజీ ప్రియుడిపై మహిళ ప్రతీకారం.. అతడి కారుతో 50 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన

బీజింగ్: మాజీ ప్రియుడిపై ఒక మహిళ ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించింది. అతడి కారుతో 50 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించింది. అయితే మాజీ ప్రియుడ్ని కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన ఆమె చివరకు పోలీసులకు పట్టుబడింది. తూర్పు చైనా జెజియాంగ్ ప్రావిన్స్‌లోని షావోజింగ్ నగరంలో ఈ ఘటన జరిగింది. లౌ, కియాన్ అనే జంట ప్రేమించుకున్నది. అయితే కియాన్ మరో మహిళతో సన్నిహితంగా ఉండటంతో లౌ నుంచి దూరమయ్యాడు. దీంతో మాజీ ప్రియుడు కియాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని లౌ భావించింది.
మరోవైపు జు అనే వ్యక్తి లౌకు తన ప్రేమను వ్యక్తం చేశాడు. అయితే కియాన్‌పై ప్రతీకారం తీన్చుకునేందుకు సహాయం చేస్తే డేటింగ్‌కు ఒప్పుకుంటానని లౌ చెప్పింది. దీంతో తనకు పరిచయం ఉన్న చెన్ అనే వ్యక్తి సాయంతో కియాన్ కారును జు అద్దెకు తీసుకున్నాడు. అనంతరం లౌ, జు కలిసి కియాన్‌కు చెందిన కారులో ప్రయాణించి 50 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు. రెండు రోజుల్లో 49 సార్లు రెడ్ లైట్‌ను క్రాస్ చేశారు. ఒకసారి వేగంగా కారును నడిపారు. 50 సార్లు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు లౌతోపాటు ఆమెకు సహకరించిన జును అరెస్ట్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

