Selling Farts : పిత్తులు అమ్మి రూ.18.5 లక్షలు సంపాదించిన మహిళ
చీ.. యాక్..అంటారా? పిత్తు అనగానే చాలామంది అనేది అదే. కానీ.. పిత్తడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో చాలామందికి తెలియదు. ఎవరికైనా పిత్తు వస్తే.. వెంటనే పిత్తేయాలి కానీ..కొందరు దాన్ని బలవంతంగా లోపలే దాచుకుంటారు. సంతృప్తిగా పిత్తడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఎన్నో సార్లు రుజువు కూడా అయింది.

ఇప్పుడు పిత్తుతూ డబ్బులు కూడా సంపాదించుకోవచ్చని ఓ మహిళ నిరూపించింది. నిరూపించడమే కాదు.. తన పిత్తులను అమ్ముకొని ఏకంగా.. రూ.18.5 లక్షలు సంపాదించింది ఆ మహిళ.
తన పేరు లష్ బొటానిస్ట్. తను పిత్తితే డబ్బులు రాలుతాయి. తన పిత్తుకు అంత డిమాండ్. తనను fart queen of the internet అని కూడా పిలుస్తారు.
నేను ఈ బిజినెస్‌ను గత మూడేళ్లుగా చేస్తున్నాను. నాకు రోజుకు చాలా డీల్స్ వస్తుంటాయి. నేను పిత్తితే క్లయింట్స్ నాకు ఫోన్ చేస్తారు. నేను చేయాల్సిందల్లా కెమెరా ముందు పిత్తడమే. ఒకసారి.. కెమెరా ముందు పిత్తాలంటూ ఒకరు ఆన్లైన్లో నన్ను అడిగారు. ఆ వీడియో పాపులర్ అవడంతో.. నాకు పిత్తే ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి.. అని లష్ చెప్పుకొచ్చింది.

నా పిత్తు బాగుండేందుకు.. నేను తినే ఆహారంలో చాలా మార్పులు చేస్తుంటాను. బెస్ట్ క్వాలిటీ పిత్తులు రావాలంటే.. బెస్ట్ ఫుడ్ తీసుకోవాలి కదా.. అని అంటుంది లష్.
తను ఏదైనా పాలకు సంబంధించిన ఫుడ్‌ను తీసుకుంటే.. తనకు పిత్తులు ఎక్కువగా వస్తాయట. తనకు లాక్టోజ్కు సంబంధించిన కొన్ని ఇష్యూస్ వల్ల పిత్తులు ఎక్కువగా వస్తాయట. ఒక్క పిత్తుకు తను 175 డాలర్ల వరకు పే చేస్తారట. ఒక రోజు అయితే.. 4000 డాలర్లను కూడా సంపాదించిందట. ఇప్పటి వరకు కేవలం పిత్తుల ద్వారా 25 వేల డాలర్లను అంటే 18.5 లక్షల రూపాయలను సంపాదించింది లష్.
తను పిత్తే పిత్తు.. బెస్ట్ గా, మంచి సౌండ్‌తో వినపడటం కోసం.. తను కెమెరాతో పాటు.. మైక్రోఫోన్‌ను ముందు పిత్తుతుంది. ఒక్కోసారి జార్లలో కూడా లష్ పిత్తుతుందట. జార్లలో పిత్తి కస్టమర్లకు పంపిస్తుందట. ఒక కస్టమర్ అయితే.. తన బొమ్మ మీద పిత్తాలంటూ రిక్వెస్ట్ పంపించాడట. రకరకాల కస్టమర్లు తనకు తగులుతారని.. ఏది ఏమైనా.. నేను మాత్రం పిత్తుతూ రెండు చేతులా సంపాదిస్తున్నానని గర్వంగా చెప్పింది లష్.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

