ఓ యువతి గత 22 ఏళ్ల నుంచి కేవలం చికెన్ మాత్రమే తింటున్నది. చదవడానికి షాకింగ్‌గా ఉన్న ఇది నిజం. తన రోజువారి డైట్లో చికెన్ నగ్గెట్స్, చికెన్ ఫ్రై, పొటాటో చిప్స్ ఇవే ఉంటాయి. పండ్లు అస్సలు పడవు తనకు. కూరగాయలు కూడా అంతే. వాటికి తను దూరం. ఇంతకీ తను ఎందుకు చికెన్ మాత్రమే తింటుంది.. కూరగాయలు, పండ్లు ఎందుకు తినడం లేదో తెలుసుకుందాం రండి.
బ్రిటన్‌కు చెందిన 25 ఏళ్ల సమ్మర్ మొన్రో అనే యువతి గురించే మనం మాట్లాడుకునేది. గత 22 ఏళ్ల నుంచి తను పండ్లు తినకున్నా.. కూరగాయలు తినకున్నా చాలా ఆరోగ్యంగా ఉందట. ఎలాంటి సమస్యలు తనకు రాలేదట.
అసలు నేను పండ్లు, కూరగాయలు ఎప్పుడు తిన్నానో నాకే తెలియదు. అవి తినకున్నా నాకు ఏం కాదు. వాటిని తినాలని కూడా లేదు. వాటిని తింటే.. నాకు ఏదోలా అవుతుంది. అందుకే.. వాటికి దూరం అయ్యా. నాకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే నేను పండ్లకు, కూరగాయలకు దూరం అయ్యా.. అంటూ సమ్మర్ చెప్పుకొచ్చింది.
అందుకే.. కేవలం చికెన్‌తో చేసిన వంటకాలు, పొటాటో చిప్స్, ఫ్రై పదార్థాలను మాత్రమే తీసుకుంటుంది సమ్మర్. ఉదయం లేవగానే తను అందరిలా బ్రేక్‌ఫాస్ట్ చేయదు. మధ్యాహ్నానికి మాత్రం పొటాటో చిప్స్ తింటుంది. రాత్రి డిన్నర్లో 8 చికెన్ నగ్గెట్స్ తింటుంది. వాటితో పాటు చికెన్ ఫ్రై కూడా తింటుంది.