మేఘన విషయంలో అన్న విలియమ్ నన్ను కొట్టాడు: ప్రిన్స్ హ్యారీ
Prince Harryప్రిన్స్ హ్యారీ రాసిన స్పేర్ ఆటోబయోగ్రఫీ జనవరి పదో తేదీన రిలీజ్ కానున్నది. అయితే ఆ బుక్లో డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. సోదరుడు ప్రిన్స్ విలియమ్ తనపై అటాక్ చేసినట్లు చెప్పారు. తన భార్య మేఘన మెర్కల్ విషయంలో.. అన్న విలియమ్ తనపై భౌతికంగా దాడి చేశాడని, కాలర్ పట్టుకుని మరీ కొట్టాడని ప్రిన్స్ హ్యారీ తన ఆటోబయోగ్రఫీలో పేర్కొన్నాడు. ఓ ఆంగ్ల పత్రిక కథనం
లండన్: ప్రిన్స్ హ్యారీ రాసిన స్పేర్ ఆటోబయోగ్రఫీ జనవరి పదో తేదీన రిలీజ్ కానున్నది. అయితే ఆ బుక్లో డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. సోదరుడు ప్రిన్స్ విలియమ్ తనపై అటాక్ చేసినట్లు చెప్పారు. తన భార్య మేఘన మెర్కల్ విషయంలో.. అన్న విలియమ్ తనపై భౌతికంగా దాడి చేశాడని, కాలర్ పట్టుకుని మరీ కొట్టాడని ప్రిన్స్ హ్యారీ తన ఆటోబయోగ్రఫీలో పేర్కొన్నాడు.
ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. మేఘన గురించి అన్న విలియమ్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని, ఆ సమయంలో తమ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, మీడియాకు కూడా మేఘన గురించి విలియమ్ అన్న తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రిన్స్ హ్యారీ తెలిపారు. ఓ దశలో విలియమ్ తన కాలర్ పట్టుకుని లాగేసినట్లు హ్యారీ చెప్పారు. తన మెడలో ఉన్న నక్లెస్ లాగేసి, తనను నేలపై పడేసి తన్నినట్లు తెలిపారు.
అన్న అటాక్ చేయడం వల్ల తనకు వెన్ను నొప్పి వచ్చినట్లు హ్యారీ చెప్పారు. 2020లో బ్రిటన్ రాజకుటుంబం నుంచి హ్యారీ, మెర్కల్ జంట వేరుపడి ఉండేందుకు నిర్ణయించిన సమయంలో అన్నాదమ్ముళ్ల మధ్య గొడవ మొదలైంది. ఇంట్లో తగాదపడ్డ హ్యారీ జంట కాలిఫోర్నియాకు వెళ్లిన విషయం తెలిసిందే.
అయితే గత ఏడాది క్వీన్ ఎలిజబెత్ 96 ఏళ్ల వయసులో మరణించారు. బ్రిటన్ చక్రవర్తిగా కింగ్ చార్లెస్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఈ ఏడాది మే నెలలో పట్టాభిషేక ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇలాంటి సమయంలో హ్యారీ, విలియమ్ గొడవ బయటపడడం శోచనీయంగా మారింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

