Wildfire | ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లో భారీ కార్చిచ్చు.. 2.50 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
Wildfire | ఫ్రాన్స్, స్పెయిన్ (France, Spain) సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు (Wildfire) సంభవించింది. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఈ కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తున్నది. ఈ క్రమంలో గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది.
Wildfire : ఫ్రాన్స్, స్పెయిన్ (France, Spain) సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు (Wildfire) సంభవించింది. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఈ కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తున్నది. ఈ క్రమంలో గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది స్థానిక ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఆ మంటలు ఆర్పడానికి వందల సంఖ్యలో అగ్నిమాపక బృందాలు కృషి చేస్తున్నాయి. రంగంలోకి దిగిన ఫ్రాన్స్ సైన్యం హెలికాప్టర్ల నుంచి కొన్ని వేల లీటర్ల నీటిని గుమ్మరిస్తూ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కార్చిచ్చును నియంత్రించేందుకు సాయం చేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ యూరోపియన్ యూనియన్ను కోరారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ సమీపంలో మంటలు తీవ్రంగా ఎగసిపడుతుండడంతో వాటిని అదుపు చేయడం సాధ్యం కావట్లేదని, వాతావరణ పరిస్థితుల కారణంగా అడ్డంకులు తప్పట్లేదని అధికారులు పేర్కొన్నారు.
ఓ ట్రాక్టర్ డ్రైవర్ శుక్రవారం అటవీ ప్రాంతానికి సమీపంలో అంటించిన మంట కార్చిచ్చుగా మారిందని స్పానిష్ పోలీసులు తెలిపారు. సైన్యం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నది. కార్చిచ్చు నేపథ్యంలో స్పెయిన్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- France
- Spain
- Telugu News
- wildfire
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

