దివ్యాంగుడైన భర్తను… 140 సార్లు కత్తితో పొడిచి చంపిన భార్య
వాషింగ్టన్: దివ్యాంగుడైన భర్తను భార్య 140 సార్లు కత్తితో పొడిచి చంపింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన జరిగింది. పామ్ బీచ్ కౌంటీలోని పామ్ స్ప్రింగ్స్ కౌంటీకి చెందిన 61 ఏండ్ల జోన్ బుర్కే, 62 ఏండ్ల భర్త మెల్విన్ వెల్లర్ను మాంసం కోసే కత్తితో పలు మార్లు పొడిచి హత్య చేసింది. 41 ఏండ్ల కుమారుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు వచ్చి కిచెన్‌లో రక్తం మడుగుల్లో మరణించిన మెల్విన్‌ను పరిశీలించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. దీంతో మృతదేహంపై 140 కత్తిపోట్లను గుర్తించారు. మృతుడి కపాలం బాగా చిద్రమైందని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు జోన్ బుర్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కింద కేసు నమాదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దివ్యాంగుడైన భర్తను ఎందుకు హత్య చేసిందో అన్నది ఆమె వెల్లడించలేదు. ఆ మహిళ మౌనంగా ఉండటంతో ఆమె మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

