సొంత ప్రజలపై పాక్ బాంబులు.. ఖైబర్ పఖ్తుంఖ్వాలో మహిళలు, చిన్నారులు సహా 30 మంది మృతి
పాకిస్థాన్ తన సొంత ప్రజలపైనే బాంబులు కురిపిస్తున్నది. ఖైబర్ పఖ్తుంఖ్వాపై సోమవారం చైనా తయారీ జే-17 యుద్ధ విమానాలతో కురిపించిన 8 ఎల్ఎస్-6 బాంబులు 30 మందిని బలిగొన్నాయి. ఈ బాంబులు లేజర్ గైడెడ్ ప్రెసిషన్ మ్యునిషన్స్.
- టీపీపీ లక్ష్యంగా దాడులు చేశామని పాకిస్థాన్ వాయుసేన వెల్లడి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ తన సొంత ప్రజలపైనే బాంబులు కురిపిస్తున్నది. ఖైబర్ పఖ్తుంఖ్వాపై సోమవారం చైనా తయారీ జే-17 యుద్ధ విమానాలతో కురిపించిన 8 ఎల్ఎస్-6 బాంబులు 30 మందిని బలిగొన్నాయి. ఈ బాంబులు లేజర్ గైడెడ్ ప్రెసిషన్ మ్యునిషన్స్. తీరహ్ లోయలోని ఓ గ్రామంపై తెల్లవారుజామున 2 గంటలకు ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉగ్రవాద దాడులు పెరిగాయి. తాజా దాడుల్లో సంభవించిన మరణాలతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. గత వారం స్వాట్ లోయలోని మింగోరా పట్టణంలో జరిగిన నిరసన కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. ప్రభుత్వం సత్వరమే శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
పాక్ మీడియా కథనాల ప్రకారం, ఖైబర్ పఖ్తుంఖ్వాలో తెహరీక్-ఏ-తాలిబన్(టీపీపీ) బాంబుల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నదని, అందుకే దాడి చేశామని పాకిస్థాన్ వాయుసేన చెప్తున్నది. ఈ ఉగ్రవాద సంస్థ అఫ్గానిస్థాన్‌లో ఉందని, దానికి అఫ్గాన్ ప్రభుత్వంతో అనుబంధం ఉందని చెప్తున్నది. ఈ ఆరోపణలను అఫ్గాన్ ప్రభుత్వం తోసిపుచ్చుతున్నది. హింసను నియంత్రించడంలో పాక్ విఫలమవుతున్నదని ఆరోపిస్తున్నది. పాకిస్థాన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాకిస్థాన్ తెహరీక్-ఏ-ఇన్సాఫ్ ఇచ్చిన ఎక్స్ పోస్ట్‌లో, మాటల్లో చెప్పలేనంత విషాదం జరిగిందని తెలిపింది. బాంబులు, డ్రోన్ దాడుల వల్ల విద్వేష బీజాలు నాటుకున్నాయని పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

