Shahzada Dawood: ఎవరీ షహజాదా దావూద్.. టైటానిక్ సబ్‌లో ఇంకెవరున్నారు ?
Shahzada Dawood: టైటానిక్ శిథిలాలను చూపించేందుకు సముద్రంలోకి టూరిస్టులను తీసుకెళ్లిన సబ్ ఆచూకీ లేకుండా పోయింది. ఆ టైటానిక్ సబ్‌లో అయిదుగురు వ్యక్తులు ఉన్నారు. దాంట్లో పాకిస్థానీ వ్యాపారవేత్త షహజాద్ దావూద్‌తో పాటు ఆయన కుమారుడు ఉన్నాడు. ఆ సబ్‌లో నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ ఉన్నట్లు తెలుస్తోంది.
కెనడా: టైటానిక్ నౌక మునిగిన ప్రదేశంలో ఉన్న శిథిలాలను చూసేందుకు వెళ్లిన అయిదుగరు టూరిస్టులు మిస్సింగ్ అయిన విషయం తెలిసిందే. సబ్మెర్సిబుల్లో ఉన్న అయిదుగురు టూరిస్టుల్లో ఇద్దరు పాకిస్థానీలు ఉన్నారు. పాక్ వ్యాపారవేత్త షహజాద్ దావూద్(Shahzada Dawood)తో పాటు ఆయన కుమారు సులేమాన్ ఉన్నారు. పాక్‌లో అత్యంత సంపన్నమైన కుటుంబానికి చెందిన వ్యక్తి షహజాద్ దావూద్. ఎస్ఈటీఐ ఇన్స్టిట్యూట్లో ఆయన ట్రస్టీగా కూడా ఉన్నారు.
పాకిస్థానీలతో పాటు బ్రిటీష్ వ్యాపారవేత్త కూడా ఉన్నారు. 58 ఏళ్ల హమీష్ హార్డింగ్ .. యాక్షన్ ఏవియేషన్ సంస్థ చైర్మెన్. ఓషియన్గేట్ సీఈవో స్టాక్టన్ రష్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఓషియన్గేట్ కంపెనీయే ఈ మిషన్‌ను ఆర్గనైజ్ చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన 73 ఏళ్ల అన్వేషకుడు పౌల్ హెన్రీ నర్జియోలెట్ కూడా ఉన్నారు. మిస్సైన పాకిస్థానీలు బ్రిటీష్ పౌరులు కూడా.
కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో టైటానికి శిథిలాల వద్ద ఈ ఘటన జరిగింది. టూరిస్టు సబ్మెర్సిబుల్ డైవ్ చేసిన గంటా 45 నిమిషాల తర్వాత ఆ సబ్‌తో లింక్ కట్ అయ్యింది. అయితే ఆ సబ్‌లో నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ ఉన్నట్లు తెలుస్తోంది. టైటాన్ సబ్మెర్సిబుల్ సుమారు 10,432 కిలోల బరువు ఉంటుంది. 6.7 మీటర్ల పొడుగు ఉంటుంది. 96 గంటల పాటు దాంట్లో అయిదుగురు ఉండవచ్చు. సబ్‌లో 8 రోజుల పర్యటనకు రెండున్నర లక్షల డాలర్లు వసూల్ చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

