వాషింగ్టన్: అమెరికా తుపాకీ సంస్కృతిపై ఆ దేశాధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ నిర్వేదం వ్యక్తం చేశారు. దేవుడా ఇంకెప్పుడు ఈ తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడుతామని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్సాస్‌లో స్కూల్ విద్యార్థులపై కాల్పుల ఘటన జరిగిన నేపథ్యంలో ఆయన వైట్‌హౌజ్‌లో జాతిని ఉద్దేశించి మాట్లాడారు. అమెరికాలో మరో సామూహిక హత్య జరిగినట్లు ఆయన అన్నారు. అందమైన, అమాయక, చిన్న పిల్లల్ని పొట్టనపెట్టుకున్నారని, ఫ్రెండ్స్ చనిపోతుంటే ఇంకా ఎలా ఆ చిన్నారులు ఆ విలయాన్ని చూస్తుంటారని, దేవుడా ఈ సంస్కృతిని అంతం చేయడం ఎలా అన్న రీతిలో బైడెన్ స్పందించారు. చిన్నారుల్ని కోల్పోవడం అంటే అది మన గుండెను గుచ్చడమే అన్నారు. ఇది తన శ్వాసను పట్టేసినట్లుగా ఉందన్నారు. బాధితుల కోసం నివాళి అర్పించాలని, గన్ సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. గన్ లాబీకి వ్యతిరేకంగా ఎప్పుడు పోరాటం చేస్తామని, మనకు ఇంకెంత ధైర్యం కావాలని ఆయన ప్రశ్నించారు.