ఒమాహా, నవంబర్ 24: ఇన్వెస్టర్ దిగ్గజం వారెన్ బఫెట్ తన కుటుంబ సభ్యులు నడిపే నాలుగు ఫౌండేషన్లకు 75 కోట్ల డాలర్లు (సుమారు రూ.6,150 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈసారి ఆయన ఇచ్చిన వార్షిక విరాళాల జాబితాలో బిల్-మెలిండా గేట్స్ ఫౌండేషన్ లేకపోవడం గమనార్హం.
ఆయన విరాళాల్లో సింహభాగం పొందుతూ వస్తున్న ఈ ఫౌండేషన్‌ను పక్కన పెట్టడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అయితే 92 ఏండ్ల గేట్స్ గత జూన్‌లో గేట్స్ ఫౌండేషన్‌కు సుమారు రూ.90 కోట్లు విరాళంగా ఇచ్చారు. 2006 నుంచి ఆయన తన కుటుంబ సభ్యుల ఫౌండేషన్లతో పాటుగా గేట్స్ ఫౌండేషన్ మానవ సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇస్తున్నారు.