Animal Power | సాధారణంగా జంతువులు పోట్లాడుకోవడం చూసే ఉంటాం. కానీ ఓ కుక్క, పులిపై దాడి చేసిన ఘటన చూసి ఉండకపోవచ్చు. పులిని చూడగానే మిగతా జంతువులు భయపడి పారిపోతాయి. దాని గాండ్రిపులకే వణుకు పుడుతోంది. అలాంటి పులిపైనే ఓ కుక్క దాడి చేసిందంటే ఆశ్చర్యమే అనిపించొచ్చు. కానీ అది నిజం.
ఒకే దగ్గర పులి, సింహం, కుక్క ఉన్నాయి. ఈ మూడు జంతువులు కూడా ఒకదానికొకటి మంచి స్నేహంతో మెలుగుతున్నాయి. అయితే కుక్క.. పులిపై దాడి చేసింది. పులి చెవిని తన నోటితో అదిమిపట్టింది కుక్క. పులి మాత్రం ఏం అనకుండా అలాగే కూర్చుండి పోయింది. సింహం కూడా కుక్కకు ఎలాంటి హానీ కలిగించలేదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇన్‌స్టా గ్రామ్‌లో ఎనిమల్స్ పవర్ అనే పేజీలో ఈ వీడియోను పోస్టు చేశారు.