Morocco Earthquake | మొరాకో (Morocco)లోని హై అట్లాస్ పర్వతాల్లో 6.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. భూకంపం ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ కుప్పలుగా శవాలు బయటపడుతున్నాయి. ఈ శక్తివంతమైన భూకంపం ధాటికి ఇప్పటి వరకూ 2,000 మందికి పైనే ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అదే సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
భూకంపం ధాటికి భవనాలు ఒక్కసారిగా నేలమట్టమయ్యాయి. దీంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పటికే వైరల్ అయ్యాయి. తాజాగా, మర్రకేష్లో ఓ వివాహ వేడుకలో జనం పరుగులు తీస్తు్న్న వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. వివాహ వేడుకలో భాగంగా కొందరు సంగీతకారులు ప్రదర్శన ఇస్తుంటారు. ఆ సమయంలో వేదిక మొత్తం ఊగిపోతుంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీస్తారు.
శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మొరాకోలోని పర్యాటక ప్రాంతమైన మర్రకేష్ (Marrakesh)కు 70 కిలోమీటర్ల దూరంలోని అట్లాస్ పర్వత ప్రాంతంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది సేపటికి 4.9 తీవ్రతతో 19 నిమిషాలపాటు పలు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మర్రకేష్కు 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 18.5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. ఆల్ హౌజ్, మర్రకేష్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రావిన్సుల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించింది. 120 ఏళ్లలో ఇంత భారీగా ప్రకంపనలు రావడం ఇదే మొదటిసారి అని స్థానిక అధికారులు తెలిపారు.
When the powerful earthquake interrupted a wedding in Marrakech Morocco #morocco #moroccoearthquake #MoroccoEathquake #MoroccoQuake #Morocco_earthquake pic.twitter.com/jvEjtZJse3
— Ahmer Butt (@ahmerbutt) September 10, 2023
Also Read..
Cyber Crime | అసలుకు, నకిలీకి మధ్య తేడాను గుర్తించండి.. 1930పై పోలీసుల వినూత్న ప్రచారం
Rain Alert | దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
Sudan Crisis | సుడాన్లో ఆగని ఆధిపత్య పోరు.. తాజా డ్రోన్ దాడిలో 43 మంది మృతి