India – EU Trade Deal | ఆ ఒప్పందం మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది.. భారత్ – ఈయూ ట్రేడ్ డీల్‌పై అమెరికా అసంతృప్తి
India - EU Trade Deal | భారత్ - యూరప్ వాణిజ్య ఒప్పందం ( India - EU FTA)పై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ ప్రజల కంటే కూడా ఈరోపియన్ యూనియన్ వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ విమర్శించారు.
India – EU Trade Deal | భారత్ – యూరప్ వాణిజ్య ఒప్పందం ( India – EU FTA)పై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ ప్రజల కంటే కూడా ఈరోపియన్ యూనియన్ వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ విమర్శించారు. ఈ ఒప్పందం తమను తీవ్ర నిరాశపరిచిందని తెలిపారు.
సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్నామని ఈయూ ఒకవైపు చెబుతూనే.. మరోవైపు రష్యా యుద్ధాన్ని కొనసాగించేందుకు పరోక్షంగా ఆర్థికసాయం చేస్తున్నాయని తెలిపారు. ఇది పూర్తిగా ద్వంద్వ వైఖరి అని విమర్శించారు. భారత్‌తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ద్వారా యూరప్ దేశాలు తమ వ్యాపార ప్రయోజనాలకే పెద్దపీట వేసినట్లు అర్థమవుతుందని అన్నారు. వాళ్లు తమకు ఏది మేలు అనిపిస్తే అది చేయాలి.. కానీ యూరప్ వైఖరి నన్ను తీవ్ర నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యానించారు.
యూరప్ దేశాలు రష్యా నుంచి నేరుగా చమురు కొనుగోలు చేయకపోయినా.. భారత్‌లో శుద్ధి చేసిన ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయని బెసెంట్ తెలిపారు. రష్యా చమురు భారత్‌కు వస్తోంది.. అక్కడ శుద్ధి అయ్యాక యూరప్‌నకు వెళ్తున్నది.. అంటే పరీక్షంగా యూరప్ రష్యా యుద్ధానికి నిధులు సమకూర్చుతున్నట్లే అని వివరించారు.
భారత్‌తో ఈయూ కుదుర్చుకున్న ఒప్పందం వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరుగుతుంది.. ఫలితంగా అమెరికాపై ఆధారపడటం తగ్గుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందంతో భారత్ నుంచి యూరప్ దిగుమతులు పెంచుకోవడంతో పాటు అమెరికాతో ఉన్న వాణిజ్య ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా ఇలా కామెంట్లు చేసిందని చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

