కోవిడ్ టీకా పేటెంటు ఎత్తివేతకు అమెరికా మద్దతు

వాషింగ్టన్: ప్రస్తుతం ప్రపంచం కోవిడ్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. ముఖ్యంగా పేద దేశాలు ఖరీదైన టీకాలు కొనలేక ఇబ్బందులు పడుతున్నాయి. టీకాల ధర పెరగడానికి పేటెంటు ఫీజులు ముఖ్య కారణం. విశ్వవ్యాప్త సంక్షోభం దృష్ట్యా ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వాలని దక్షిణాఫ్రికాతోపాటుగా భారత్ అమెరికాకు విజ్ఞప్తి సచేసింది.
దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మేధో సంపత్తి హక్కులు ముఖ్యమే అయినప్పటికీ మహమ్మారినిి అందరూ కలిసి అంతం చేయాల్సి ఉన్నందున పేటెంటు మినహాయింపును వాషింగ్టన్ సమర్థిస్తున్నదని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరిన్ టాయ్ ప్రకటించారు. “ఇది అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభం. అసాధారణ పరిస్థితుల్లో మనమంతా ఉన్నాం. అందుకు మన ప్రతిస్పందన కూడా అసాధారణంగానే ఉండాలి” అని ఆమె పేర్కొన్నారు.
ప్రపంచ వాణిజ్య సంస్థ జరిపే ఏకాభిప్రాయ సాధన కృషికి కొంత సమయం పట్టవచ్చని ఆమె గుర్తు చేశారు. అమెరికా సమాజాికి సరపడా సరఫరాలు సమకూరినందున ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం టీకాల ఉత్పాదన, పంపిణీ విస్తరణపై దృష్టి పెట్టిందని ఆమె వివరించారు. అలాగే టీకా ముడి పదార్థాల ఉత్పత్తి పెంచేందుకు కూడా కృషి చేస్తుందని టాయ్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

