ఇరాన్‌పై మళ్లీ దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. వ్యూహాత్మకంగా కీలకమైన హొర్ముజ్ జలసంధిలో ఇరాన్‌కు చెందిన లక్ష్యాలపై అమెరికా దాడులు జరిపింది. ఈ విషయాన్ని అమెరికా అధికారి ఒకరు వెల్లడించినట్టు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.
- ఖేష్మ్ ద్వీపంపై అమెరికా క్షిపణుల వర్షం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. వ్యూహాత్మకంగా కీలకమైన హొర్ముజ్ జలసంధిలో ఇరాన్‌కు చెందిన లక్ష్యాలపై అమెరికా దాడులు జరిపింది. ఈ విషయాన్ని అమెరికా అధికారి ఒకరు వెల్లడించినట్టు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం. అయితే ఇవి పరిమిత స్థాయిలోనే జరిగిన సైనిక చర్యగా భావిస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం.. ఖేష్మ్, హెంగామ్ దీవులతోపాటు సమీపంలోని ప్రధాన భూభాగ ప్రాంతమైన బందర్ అబ్బాస్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
గతంలో జరిగిన దాడుల మాదిరిగా ఈసారి అమెరికా ముందుగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో ప్రకటించారు. అయితే, ఇప్పుడు దాడులు జరగడం ఆయన వైఖరిలో మార్పునకు సంకేతంగా కనిపిస్తున్నది. ఇరాన్‌తో యుద్ధం, దాని ప్రభావంతో అమెరికాలో పెరిగిన పెట్రోల్ ధరలు, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారం.. కాంగ్రెస్‌పై పట్టు నిలుపుకోవాలని భావిస్తున్న ట్రంప్, రిపబ్లికన్ పార్టీకి ప్రతికూలంగా మారాయి.
10 లక్షల మంది స్వచ్ఛంద సైనికులకు ఇరాన్ శిక్షణ
అమెరికాతో ఘర్షణలు మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్ తన సైనిక సన్నద్ధతను పెంచుతున్నది. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది పారామిలిటరీ స్వచ్ఛంద కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా సోమవారం టెహ్రాన్‌లో మూడో సైనిక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్కు అనుబంధంగా పనిచేసే బసీజ్ పారామిలిటరీ దళ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వారం నుంచే దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో 1500 శిక్షణ కేంద్రాలు పనిచేయడం ప్రారంభిస్తాయని బసీజ్ శిక్షణ విభాగం డిప్యూటీ అధిపతి అలీ కౌసారీ తెలిపారు.
ఒమన్‌లో భారత నౌకపై దాడి.. గుజరాత్ వాసి
మన దేశ పతాకంతో వస్తున్న ఒక వాణిజ్య నౌకపై ఒమన్ తీరంలో సోమవారం జరిగిన దాడిలో ఒక భారతీయుడు మరణించాడని ఒమన్ విదేశాంగ శాఖ తెలిపింది. నౌకలో ఉన్న 14 మంది భారతీయుల్లో 13 మందిని ఒమన్ కోస్ట్‌గార్డు రక్షించిందని పేర్కొంది. ఎంఎస్వీ ఏఎల్ జేయూఎస్యూఎఫ్ఐ పేరుగల వాణిజ్య నౌకపై ఒమన్‌లో లిమ్హా సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వైమానిక దాడి జరిపారని కేంద్ర పోర్టులు, నౌక, జలరవాణా శాఖ మంత్రి శర్బనాద సోనావాల్ తెలిపారు. ఈ దాడిలో గుజరాత్‌కు చెందిన గాంధార్ నహీమ్ అజిత్ మరణించాడని పేర్కొంటూ ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ దాడిపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

