సోమాలియాలో అమెరికా సైన్యం దాడులు.. 30 మంది అల్ శబాబ్ ఉగ్రవాదులు హతం
Somalia | సోమాలియాలోని గాల్కాడ్ టౌన్ సమీపంలో అమెరికా మిలిటరీ దాడులు నిర్వహిస్తున్నది. ఇందులో ఇస్లామిక్ అల్ శబాబ్కు చెందిన 30 మంది తీవ్రవాదులు హతమైనట్లు అమెరికా ఆఫ్రికా కమాండ్
వాషింగ్టన్: సోమాలియాలోని గాల్కాడ్ టౌన్ సమీపంలో అమెరికా మిలిటరీ దాడులు నిర్వహిస్తున్నది. ఇందులో ఇస్లామిక్ అల్ శబాబ్కు చెందిన 30 మంది తీవ్రవాదులు హతమైనట్లు అమెరికా ఆఫ్రికా కమాండ్ వెల్లడించింది. అల్ శబాబ్ సంస్థకు చెందిన 100 మందికిపైగా తీవ్రవాదులు దాడులు చేశారని, వారిని నిలువరించేందుకు ఆత్మరక్షణలో భాగంగా సోమాలియా ఆర్మితో కలిసి యూఎస్ ఆర్మీ దాడులు చేసిందని తెలిపింది. ఈ దాడిలో సాధారణ పౌరులు ఎవరూ గాయపడలేదని చెప్పింది.

సోమాలియాలో ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు గతేడాది మే నుంచి అమెరికా సైన్యం ఆ దేశంలో మోహరించింది. ఉగ్రవాదులతో జరుగుతున్న పోరులో సోమాలియా ఆర్మితో కలిసి యూఎస్ సైనికులు పాల్గొంటున్నారు. ఆ దేశ సైన్యానికి శిక్షణతోపాటు సహాయం అందిస్తున్నది. కాగా, ఈ నెల 17న సోమాలియాలోని షాబెల్ రీజియన్‌లో మిలట్రీ బేస్‌పై అల్ శబాబాద్ ఉగ్రవాదులు జరిగిన దాడిలో 10 మంది సైనికులు చనిపోయారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

