అణుబాంబుల సంఖ్యను వెల్లడించిన అమెరికా

వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం తమ వద్ద ఉన్న అణు బాంబుల సంఖ్యను వెల్లడించింది. గత నాలుగేళ్లలో ఆ సంఖ్యను ప్రకటించడం ఇదే తొలిసారి. అణ్వాయుధాల డేటాను వెల్లడించేందుకు నాలుగేళ్ల క్రితం మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అమెరికా వద్ద 3,750 అణ్వాయుధాలు ఉన్నట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. 2019తో పోలిస్తే ఆ సంఖ్య 55 తక్కువే. ఇక 2017తో పోలిస్తే 72 తక్కువగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 1967లో రష్యాతో ప్రచ్ఛన్న యుద్ధం మొదలైన తర్వాత అమెరికా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకున్నది. ఒకప్పుడు అమెరికా వద్ద 31,255 అణుబాంబులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య క్రమంగా పడిపోయింది. రష్యాతో ఆయుధ నియంత్రణపై చర్చలు నిర్వహించినున్న నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం అణుబాంబుల సంఖ్యను ప్రకటించింది. నిరాయుధీకరణలో పారదర్శకత అవసరమని ప్రభుత్వం వెల్లడించింది.
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఈ ఏడాది జనవరి వరకు అమెరికా వద్ద 5,550, రష్యా వద్ద 6255, చైనా వద్ద 350, బ్రిటన్ వద్ద 225, ఫ్రాన్స్ 290 అణుబాంబులు ఉన్నాయి. ఇండియా, పాకిస్థాన్, ఇజ్రాయిల్, నార్త్ కొరియా వద్ద మొత్తం కలిపి 460 న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నట్లు ఆ ఇన్స్టిట్యూట్ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

