పోలీసుల అమానుషం.. అమెరికాలో మరో నల్ల జాతీయుడిపై పాశవిక దాడి
అమెరికాలో నల్ల జాతీయుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. గతంలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని చిత్రహింసలు పెట్టి చంపిన పోలీసులు.
- తీవ్ర గాయాలతో బాధితుడి మృతి
వాషింగ్టన్: అమెరికాలో నల్ల జాతీయుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. గతంలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని చిత్రహింసలు పెట్టి చంపిన పోలీసులు.. ఇప్పుడు టెనెస్సీ మెంఫిస్ నగరంలో టైర్ నికోల్స్ (29) అనే మరో నల్ల జాతీయుడిపై పాశవిక దాడికి పాల్పడి అతని ప్రాణాలను బలి తీసుకున్నారు. దీంతో నికోల్స్‌ను హత్య చేశారన్న అభియోగాలతో ఆ పోలీసులపై కేసు నమోదైంది. ఈ దాడికి పాల్పడిన పోలీసులు కూడా నల్ల జాతీయులే కావడం గమనార్హం. ఈ నెల 7న జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియోను మెఫిస్ పోలీసులు శుక్రవారం విడుదల చేయడంతో అమెరికా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ట్రాన్స్పోర్ట్ కంపెనీ ‘ఫెడెక్స్’లో ఉద్యోగిగా పనిచేస్తున్న నికోల్స్ కారులో ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించాడన్న కారణంతో ఐదుగురు పోలీసు అధికారులు అతడిని ఆపారు. పెప్పర్ స్ప్రే ఉపయోగించి దాదాపు 3 నిమిషాలపాటు నికోల్స్‌ను దారుణంగా చావబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నికోల్స్ దవాఖానలో చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత (ఈ నెల 10న) మృతి చెందాడు. దీనిపై అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం స్పందించారు. మృతుడి కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

