Iran vs US | ‘ఆపరేషన్ స్లడ్జ్ హ్యామర్’.. ఇరాన్‌పై దాడులకు అమెరికా ప్లాన్ చేస్తున్న కొత్త ఆపరేషన్
Iran vs US | ఇరాన్ (Iran) పై మళ్లీ దాడులకు దిగాల్సివస్తే కాంగ్రెస్ అనుమతి (Congress Permission) అవసరం లేకుండా చూసేందుకు అమెరికా (USA) సైన్యం కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. పేరు మార్చి ‘ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్ (Operation Sledgehammer)’ పేరుతో దాడులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
Iran vs US : ఇరాన్ (Iran) పై మళ్లీ దాడులకు దిగాల్సివస్తే కాంగ్రెస్ అనుమతి (Congress Permission) అవసరం లేకుండా చూసేందుకు అమెరికా (USA) సైన్యం కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. పేరు మార్చి ‘ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్ (Operation Sledgehammer)’ పేరుతో దాడులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యకు ట్రంప్ యంత్రాంగం ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury) అని పేరు పెట్టింది. భీకర యుద్ధం అనంతరం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతోనే ఆపరేషన్ ముగిసిందని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ సర్కారు కాంగ్రెస్‌కు తెలిపింది. మరోవైపు యుద్ధం ముగింపు ప్రతిపాదనల విషయంలో ఇరుదేశాల మధ్య తిరస్కరణల పరంపర కొనసాగుతోంది.
ఇరాన్ తమతో ఒప్పందానికి రాకపోతే మాత్రం మరోసారి దాడులకు దిగుతామని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలో చర్చలు విఫలమై ట్రంప్ మళ్లీ యుద్ధం చేపడితే.. అది మరింత తీవ్రంగా ఉంటుందన్న అర్థం వచ్చేలా దానికి ‘ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్’ గా పేరు పెట్టాలని అమెరికా సైన్యం యోచిస్తోంది. దీంతోపాటు మరికొన్ని పేర్లను కూడా అది పరిశీలిస్తుంది. ఈ పేరు మార్పుతో కాంగ్రెస్ అనుమతి వచ్చేదాకా కొత్త ఆపరేషన్‌కు 60 రోజుల సమయం దొరుకుతుంది.
అమెరికా నిబంధనల ప్రకారం.. యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం అక్కడి కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుంది. సాధారణంగా శత్రు భూభాగంలో సైనిక చర్యలు ప్రారంభించిన 48 గంటల్లోపు అధ్యక్షుడు అక్కడి కాంగ్రెస్‌కు తెలియజేయాలి. ఆ తర్వాత 60 రోజుల్లోగా కాంగ్రెస్ అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే ఈ 60 రోజులూ సైనిక చర్యను కొనసాగించవచ్చు. పాత అపరేషన్ మొదలై 60 రోజులు ముగిసింది. కాంగ్రెస్ నిర్ణయం వెల్లడించకముందే ఇరాన్-అమెరికా తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

