కాంగ్రెస్‌పై పట్టు సాధించేదెవరో?
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు మంగళవారం జరిగాయి. అధిక ధరలు, ఇరాన్‌తో యుద్ధంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో విడత పాలనపై ప్రజాభిప్రాయానికి పరీక్షగా మారాయి.
- అమెరికాలో మధ్యంతర ఎన్నికలు
- డెమోక్రాట్లు, రిపబ్లికన్ల హోరాహోరీ
వాషింగ్టన్: అమెరికాలో మధ్యంతర ఎన్నికలు మంగళవారం జరిగాయి. అధిక ధరలు, ఇరాన్‌తో యుద్ధంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో విడత పాలనపై ప్రజాభిప్రాయానికి పరీక్షగా మారాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ఉభయ సభల్లోనూ రిపబ్లికన్లకు ఆధిక్యం ఉన్నది. 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించేందుకు డెమోక్రాట్లకు మూడు స్థానాలు అదనంగా గెలుచుకుంటే సరిపోతుంది. సెనేట్‌లో ఆధిక్యం కోసం నాలుగు స్థానాలు అదనంగా సాధించాలి.
దీంతో రెండు సభల్లోనూ పోటీ ఉత్కంఠగా మారింది. సోమవారం నాటికి 5.7 కోట్ల మందికిపైగా ముందస్తుగా ఓటువేశారు. ధరల పెరుగుదలపై ప్రజల్లో అసంతృప్తి తమకు కలిసి వస్తుందని డెమోక్రాట్లు భావిస్తున్నారు. ఏపీ-ఎన్ఓఆర్సీ సర్వే ప్రకారం ట్రంప్ పనితీరుకు కేవలం 35 శాతం మంది మాత్రమే ఆమోదిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై ఆయనకు మద్దతు 25 శాతానికే పరిమితమైంది. మరోవైపు, ట్రంప్ తన పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తూ తానే పోటీలో ఉన్నట్టు భావించి ఓటు వేయాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
జార్జియా, నార్త్ కరోలినా, ఓహియో, అలస్కా రాష్ర్టాల్లో సెనేట్ పోటీలు కీలకంగా మారాయి. టెక్సాస్, ఫ్లోరిడా, అయోవా రాష్ర్టాల్లోనూ ప్రతినిధుల సభ స్థానాల కోసం ఇరు పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. దేశవ్యాప్తంగా 36 రాష్ర్టాల్లో గవర్నర్ల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. డెమోక్రాట్లు కాంగ్రెస్‌లోని కనీసం ఒక సభను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే ట్రంప్ ప్రభుత్వంపై విచారణలు చేపట్టడంతోపాటు, ఆయన విధానాలను అడ్డుకునే అవకాశం ఉంటుంది. రిపబ్లికన్లు ఆధిక్యం నిలుపుకుంటే ట్రంప్ ప్రతిపాదనలకు మద్దతు కొనసాగుతుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

