JD Vance | అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి : ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
JD Vance | హెచ్-1బీ వీసా (H1B VISA) దుర్వినియోగాలకు పాల్పడే వారిపై అమెరికా (USA) చేపట్టిన చర్యలపై ఆ దేశ ఉపాధ్యక్షుడు (Vice President) జేడీ వాన్స్ (JD Vance) స్పందించారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలని పునరుద్ఘాటించారు. వీసా మోసాలకు పాల్పడే వారిపై అమెరికా కార్మిక శాఖ (US Labour Ministry) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందని, విచారణ నిమిత్తం కొంతమందికి నోటీసులు కూడా జారీ చేసిందని తెలిపారు.
JD Vance : హెచ్-1బీ వీసా (H1B VISA) దుర్వినియోగాలకు పాల్పడే వారిపై అమెరికా (USA) చేపట్టిన చర్యలపై ఆ దేశ ఉపాధ్యక్షుడు (Vice President) జేడీ వాన్స్ (JD Vance) స్పందించారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలని పునరుద్ఘాటించారు. వీసా మోసాలకు పాల్పడే వారిపై అమెరికా కార్మిక శాఖ (US Labour Ministry) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందని, విచారణ నిమిత్తం కొంతమందికి నోటీసులు కూడా జారీ చేసిందని తెలిపారు. విస్కాన్సిన్లో జరిగిన ఓ కార్యక్రమంలో వాన్స్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన.. అత్యున్నత ప్రతిభ కలిగిన శాస్త్రవేత్తలు, వైద్యులు, సాంకేతిక నిపుణులు అమెరికాలో పనిచేసేందుకు వీలుగా తాము హెచ్-1బీ వీసాను రూపొందించామని, కానీ కొన్ని పెద్ద కంపెనీలు, వ్యక్తులు ఈ వీసా విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వాన్ అన్నారు. తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను నియమించుకుని అమెరికా కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. పన్ను చెల్లింపుదారుల సొమ్ము కాపాడటంతోపాటు వీసా దుర్వినియోగాన్ని అరికట్టడమే ట్రంప్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
వీసా దుర్వినియోగం చేసేవారిని ఇకపై ఉపేక్షించబోమని జేడీ వాన్స్ అన్నారు. వీసా దుర్వినియోగం చేసే వారికి అమెరికాలోకి ప్రవేశం ఉండదని చెప్పారు. వీసా వ్యవస్థలో మోసాలను అరికట్టేందుకు కార్మిక శాఖ విస్తృత స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తోందని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

