వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలొసి భర్త పౌల్ పెలొసిని పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులో వాహనాన్ని నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నాపా కౌంటీ క్రిమినల్ కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. శనివారం రాత్రి నాపా కౌంటీ వద్ద ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు నేరాభియోగాలపై ఆయన్ను జైలుకు తీసుకువెళ్లారు. రక్తంలో ఆల్కహాల్ కాంటెంట్ అధిక స్థాయిలో ఉందని కూడా ఆయన్ను అరెస్టు చేశారు. అయితే 5 వేల డాలర్ల పూచీకత్తుపై పౌల్ పెలొసిని విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పట్ల స్పీకర్ పొలొసి ఎటువంటి ప్రకటన చేయలేదని ఆమె ప్రతినిధి తెలిపారు. పౌల్ పెలొసి వయసు 82 ఏళ్లు. శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు. 1963లో నాన్సీతో పెళ్లి అయ్యింది. ఇద్దరికీ అయిగురు పిల్లలు ఉన్నారు.