బీరట్: ఉత్తర సిరియాలో అమెరికా దళాలు వైమానిక దాడులు నిర్వహించాయి. ఆ అటాక్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూపుకు చెందిన సీనియర్ నేత మృతిచెందినట్లు అమెరికా మిలిటరీ ప్రకటించింది. దీనిపై అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన రిలీజ్చేస్తూ.. మిడిల్ ఈస్ట్, యూరోప్ దేశాల్లో ఆ ఐఎస్ నేత ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నది. హెలికాప్టర్ రెయిడ్(Helicopter Raid) జరిగిన ప్రదేశంలో మరో ఇద్దరు సాయుధులు కూడా ఉన్నారని, ఆ ఇద్దరు కూడా మరణించినట్లు ప్రకటనలో తెలిపారు. ఈ ఆపరేషన్లో అమెరికా దళాలు గాయపడలేదని చెప్పారు.
A US Central Command helicopter raid in northern Syria targeted a Senior ISIS Leader. pic.twitter.com/BoenvFfbmS
— U.S. Central Command (@CENTCOM) April 17, 2023