Blue Ghost Lander | చంద్రుడిపై ప్రైవేట్ ల్యాండర్.. చరిత్ర సృష్టించిన ఫైర్‌ఫ్లై
అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్' సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ సంస్థ ప్రయోగించిన ‘బ్లూ ఘోస్ట్' ల్యాండర్ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆదివారం చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా కాలుమోపింది. టెక్సాస్‌లోని ‘ఫైర్‌ఫ్లై’ మిషన్ కంట్రోల్ విభాగం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
- విజయవంతంగా దిగిన ప్రైవేట్ ల్యాండర్.. చరిత్ర సృష్టించిన ‘ఫైర్‌ఫ్లై’ ఏరోస్పేస్ సంస్థ
Blue Ghost Lander | కేప్ కెనవరాల్ (అమెరికా), మార్చి 2 : అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ సంస్థ ప్రయోగించిన ‘బ్లూ ఘోస్ట్’ ల్యాండర్ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆదివారం చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా కాలుమోపింది. టెక్సాస్‌లోని ‘ఫైర్‌ఫ్లై’ మిషన్ కంట్రోల్ విభాగం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీంతో చంద్రుని ఉపరితలంపై సరైన స్థితిలో వ్యోమనౌకను దించిన తొలి ప్రైవేట్ సంస్థగా ‘ఫైర్‌ఫ్లై’ రికార్డులకెక్కింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ‘స్పేస్ఎక్స్’ సంస్థకు చెందిన ‘ఫాల్కన్-9’ రాకెట్ జనవరి 15న ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ‘బ్లూ ఘోస్ట్’తోపాటు జపాన్‌లోని ‘ఐస్పేస్’ సంస్థకు చెందిన మరో ల్యాండర్ ‘హకుటో ఆర్-2’ను నింగిలోకి తీసుకెళ్లింది.
6 అడుగుల (2 మీటర్ల) పొడవు, 11 అడుగుల (3.5 మీటర్ల) వెడల్పుతో పసిడి వర్ణంలో ‘బ్లూ ఘోస్ట్’ చంద్రుని కక్ష్య నుంచి ఆటోపైలట్ పద్ధతిలో కిందికి ప్రయాణించి ఈశాన్య అంచున ఉన్న మోన్స్ లాట్రెయిల్లే సమీపంలో దిగింది. వాక్యూమ్‌ను ఉపయోగించి చంద్రుడి ధూళిని సేకరించడం, జాబిల్లి ఉపరితలాన్ని డ్రిల్లింగ్ చేసి అక్కడి ఉష్ణోగ్రతలను కొలవడం, వ్యోమగాముల స్పేస్సూట్లకు, పరికరాలకు అంటుకునే హానికరమైన ధూళిని తొలగించేందుకు రూపొందించిన మరో పరికరాన్ని పరీక్షించడం సహా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు సంబంధించిన 10 ప్రయోగాలను ‘బ్లూ ఘోస్ట్’ నిర్వహించనుంది. ఇందుకోసం ‘ఫైర్‌ఫ్లై’ సంస్థకు నాసా మొత్తం 145 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,268) కోట్లు చెల్లించింది.
గురువారం మరో వ్యోమనౌక ల్యాండింగ్
హ్యూస్టన్‌లోని ‘ఇంట్యూయిటివ్ మెషీన్స్’ సంస్థ రూపొందించిన మరో ల్యాండర్ కూడా త్వరలో చంద్రుడిపై దిగేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం చంద్రుడి దక్షిణ ధృవానికి దాదాపు 100 మైళ్ల (160 కి.మీ) దూరంలో ఉన్న ఈ ల్యాండర్‌ను గురువారం జాబిల్లి ఉపరితలంపై దింపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. నిరుడు ‘ఇంట్యూయిటివ్ మెషీన్స్’ సంస్థ ప్రయోగించిన మొదటి ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై ఒరిగిపోయింది. ఆ ల్యాండర్ కాలు (లెగ్) విరిగిపోవడమే ఇందుకు కారణం. కాగా, ‘బ్లూ ఘోస్ట్’తోపాటు నింగిలోకి వెళ్లిన ‘హకుటో ఆర్-2’ ల్యాండర్ మే నెల చివర్లో లేదా జూన్ మొదట్లో చంద్రుడిపై దిగనుంది. జాబిల్లిపై ల్యాండర్‌ను దింపేందుకు ‘ఐస్పేస్’ ప్రయత్నించడం ఇది రెండోసారి. రెండేండ్ల క్రితం ఆ సంస్థ ప్రయోగించిన మొదటి ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై కూలిపోయింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

