F-16 Fighter Jet: దక్షిణ కొరియా తీరం వద్ద కూలిన ఎఫ్-16 ఫైటర్ జెట్
F-16 fighter jet: అమెరికా యుద్ధ విమానం ఎఫ్-16.. దక్షిణ కొరియా తీరం వద్ద కూలింది. ఈ ప్రమాదం నుంచి ఆ విమాన పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. కేవలం నెలన్నర వ్యవధిలోనే కొరియా తీరంలో ఎఫ్-16 యుద్ధ విమానం కూలడం ఇది రెండవ ఘటన.
సియోల్: అమెరికా యుద్ధ విమానం ఎఫ్-16(F-16 Fighter Jet).. దక్షిణ కొరియా తీరం వద్ద కూలింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆ విమాన పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. కేవలం నెలన్నర వ్యవధిలోనే కొరియా తీరంలో ఎఫ్-16 యుద్ధ విమానం కూలడం ఇది రెండవ ఘటన. గత ఏడాది డిసెంబర్లో కూడా ఓ యుద్ధ విమానం ఇక్కడే కూలింది. 8వ ఫైటర్ వింగ్‌కు చెందిన ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్ గాలిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీని లోనైందని, ఆ తర్వాత ఆ విమానం సముద్రంలో కూలినట్లు అమెరికా వైమానిక దళం ఓ ప్రకటనలో తెలిపింది. విమానం కూలుతున్న సమయంలో పైలెట్ సురక్షితంగా బయటకు వచ్చాడు.దక్షిణ కొరియాలో ఉన్న గున్సన్ సిటీ బేస్‌ను అమెరికా మిలిటరీ కొన్నాళ్ల నుంచి వాడుకుంటోంది. ఈ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపడుతున్నట్లు ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది. పైలెట్‌ను త్వరగా రక్షించిన కొరియా రిపబ్లిక్ దళాలకు, తమ బృందానికి థ్యాంక్స్ చెబుతున్నట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారి తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

