5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు ఫైజర్ టీకా.. ఓకే చెప్పిన అమెరికా

వాషింగ్టన్: అయిదేళ్ల నుంచి 11 ఏళ్ల వయసున్న చిన్నారులకు ఫైజర్ టీకా ఇచ్చేందుకు అమెరికా అనుమతి ఇచ్చింది. దీంతో ఆ దేశంలో సుమారు 2.8 కోట్ల మంది చిన్నారులు కోవిడ్ టీకా తీసుకునే వెసలుబాటు కలుగనున్నది. ఉన్నత స్థాయి వైద్య బృందం ఇచ్చిన సలహా మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. చైనా, చిలీ, క్యూబా, యూఏఈ దేశాలు ఇప్పటికే చిన్నారులకు టీకాలు ఇస్తున్నాయి. ఓ తల్లిగా, ఓ డాక్టర్‌గా ఈ సందర్భం కోసం ఎదురుచూస్తున్నట్లు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ జానెట్ వుడ్‌కాక్ ఓ ప్రకటనలో తెలిపారు. పిల్లలకు టీకాలు ఇవ్వడం వల్ల కోవిడ్19 అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆమె అన్నారు.
అమెరికాలో పిల్లల కోసం 5 కోట్ల కోవిడ్ డోసులను రెడీగా ఉంచినట్లు ఫైజర్ సంస్థ ప్రకటించింది. క్లినికల్ ట్రయల్స్‌లో సుమారు రెండు వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. 90 శాతం సమర్థంగా పనిచేసినట్లు తెలుస్తోంది. మూడు వేల మంది చిన్నారుల్లో వ్యాక్సిన్ సేఫ్టీ గురించి స్టడీ చేశారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని గుర్తించామని అధికారులు తెలిపారు. వయోజనుల్లో వచ్చే తీవ్రమైన కోవిడ్ లక్షణాలు పిల్లల్లో ఉండవన్నారు. కరోనా మహమ్మారి మొదలైన నాటి నుంచి 5 నుంచి 11 ఏళ్ల వయసున్న వారిలో 8300 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. వారిలో 146 మంది మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

