Devendra Fadnavis: గడ్చిరౌలిపై అర్బన్ నక్సల్స్ దుష్ప్రచారం చేస్తున్నారు: సీఎం ఫడ్నవీస్
Devendra Fadnavis: మహారాష్ట్రకు సంబంధం లేని వ్యక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, అర్బన్ నక్సల్స్ విదేశీ నిధులతో.. సోషల్ మీడియా పోస్టులతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు. అబద్దాలు చెబుతూ అర్బన్ నక్సల్స్ గడ్చిరౌలిని అభివృద్ధికి దూరం చేస్తున్నారని ఆయన తెలిపారు.
గడ్చిరౌలి: విదేశీ నిధులతో గడ్చిరోలిపై అర్బన్ నక్సల్స్ దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం చేస్తున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ఆరోపించారు. లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గడ్చిరౌలి జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. గడ్చిరౌలిలో నక్సలిజం తగ్గుతోందని, ప్రస్తుతం కొంత మంది నక్సలైట్లు మాత్రమే ఉన్నారని, వాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు అని, ఇక్కడి అడవుల్లో వాళ్లు ఉన్నారని ఆయన అన్నారు. హింసను వీడాలని నక్సలైట్లకు అప్పీల్ చేస్తున్నట్లు సీఎం ఫడ్నవీస్ తెలిపారు. ప్రధాన జీవనస్రవంతిలో కలవాలని కోరుతున్నట్లు చెప్పారు.
అయితే గన్ పట్టుకుని తిరిగే నక్సలైట్లు తగ్గుతున్న దశలో.. అర్బన్ నక్సల్స్ సంఖ్య పెరుగుతోందని సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు. అర్బన్ నక్సల్స్ పట్ల అలర్ట్‌గా ఉండాలని, వాళ్లు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారని, గడ్చిరౌలిలో స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపన చేయగా, మరుసటి రోజే సోషల్ మీడియాలో దుష్ ప్రచారం మొదలుపెట్టారని, గిరిజనులను చంపుతున్నారని ప్రచారం చేస్తున్నట్లు సీఎం ఆరోపించారు. భారీ స్థాయిలో అడువుల్ని నరికివేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే, ఎలా వ్యతిరేక క్యాంపేన్ చేపడుతున్నారని ఆయన అడిగారు.
మహారాష్ట్రకు సంబంధం లేని వ్యక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, ఇద్దరు కోల్‌కతాలో ఉన్నారని, మరో ఇద్దరు బెంగుళూరులో ఉన్నారని, వాళ్లు విదేశీ నిధులతో పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆ వ్యక్తులు విదేశీ నిధులతో.. సోషల్ మీడియా పోస్టులతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు. అబద్దాలు చెబుతూ అర్బన్ నక్సల్స్ గడ్చిరౌలిని అభివృద్ధికి దూరం చేస్తున్నారని ఆయన తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

