Imran Khan | ఇమ్రాన్ అరెస్టు చట్టవిరుద్ధం.. దేశాన్ని జైలుగా మారనివ్వబోం..! : పాక్ సుప్రీంకోర్టు
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ అరెస్ట్ చట్టవిరుద్ధమని, దేశాన్ని జైలుగా మార్చేందుకు అనుమతించలేమని ఆ దేశ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో మంగళవారం ఆర్మీ రేంజర్లు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ అరెస్ట్ చట్టవిరుద్ధమని, దేశాన్ని జైలుగా మార్చేందుకు అనుమతించలేమని ఆ దేశ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో మంగళవారం ఆర్మీ రేంజర్లు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో మంగళవారం ఆర్మీ రేంజర్లు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరో వైపు మాజీ విదేశాంగ మంత్రి, ఇమ్రాన్ సన్నిహితుడు హమ్మద్ ఖురేషిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అయితే, ప్రత్యేక కోర్టు బుధవారం ఇమ్రాన్‌ను నాబ్ (నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో) కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. అరెస్టుకు నిరసనగా పాక్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇస్లామాబాద్‌తో పాటు మూడు ప్రావిన్సులలో ప్రభుత్వ సైన్యాన్ని మోహరించింది.
మరో వైపు మాజీ ప్రధాని, పీటీఐ చైర్మన్ ఇమ్రాన్‌ను సాయంత్రం 4.30 గంటల్లోగా హాజరుపరచాలని ఇస్లామాబాద్ ఐజీని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఈ క్రమంలో కోర్టులో ఆయనను హాజరుపరిచింది. హైకోర్టు ప్రాంగణంలో ఇమ్రాన్‌ను అరెస్టు చేయడం దేశంలోని న్యాయవ్యవస్థను అవమానించడమేనని పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియల్ పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టును సవాల్ చేస్తూ పీటీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనంలో సీజేపీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా ఇమ్రాన్ అరెస్ట్ చట్టవిరుద్ధమంటూ, భవిష్యత్‌కు ఆదర్శంగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన కోర్టు.. పాక్‌ను జైలుగా మార్చేందుకు అనుమతించబోమని కోర్టు పేర్కొంది. మరో వైపు ఇమ్రాన్‌కు మద్దతుగా పాక్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. దాంతో పాటు పలుదేశాల్లోనూ మద్దతుదారులు అరెస్టును నిరసిస్తూ నిరసనలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఆందోళన వీడియోలను పీటీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా పాక్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ స్పందిస్తూ ఏ రాజకీయ పార్టీని నిషేధించేందుకు తాను ఇష్టనపడనని, అలాంటి నిర్ణయాన్ని అంగీకరించే వ్యక్తుల్లో తాను చివరి వ్యక్తిని తానేనని పేర్కొన్నారు. పీటీఐ రాజకీయ పార్టీగా తన హోదాను కొనసాగించడం ముఖ్యమని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే గ్రూప్‌గా మారొద్దని సూచించారు. పార్టీని దేశంలో సాయుధ తిరుగుబాటు చేయాలని పీటీఐ నిర్ణయించుకుంటే.. ఆ పార్టీని ప్రభుత్వం నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు.
دنیا بھر میں مقیم پاکستانیوں کا عمران خان کے اغواء کے خلاف بھرپور احتجاج جاری۔ #IamImranKhan pic.twitter.com/y0Kvt1Hsmy
— PTI (@PTIofficial) May 11, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

