న్యూయార్క్: గతేడాది కొవిడ్-19 మహమ్మారితో అతలాకుతలం అయిన అమెరికా త్వరలో అప్డేటెడ్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ వ్యాక్సిన్‌ను మొదట వృద్ధులు, గర్భిణులకు అందించనున్నారు. ఒమిక్రాన్ సంతతికి చెందిన ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ లక్ష్యంగా ఈ వ్యాక్సిన్‌ను తీసుకొస్తున్నది. త్వరలో దీనికి అనుమతులు లభించే అవకాశం ఉందని సీడీసీ అధికారులు తెలిపారు. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ (ఆర్ఎస్వీ) కేసులు క్రమంగా పెరుగుతుండటంతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది.