ఐవర్‌మెక్టిన్‌తో ఆక్స్ఫర్డ్ ట్రయల్స్

లండన్ : కోవిడ్ చికిత్స కోసం ఐవర్‌మెక్టిన్ ఔషధాన్ని వాడవచ్చా లేదా అన్న కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. యాంటీ పారసైటిక్ ఔషధమైన ఐవర్మెక్టిన్ను దాదాపు చాలా వరకు దేశాలు ప్రస్తుతం కోవిడ్ చికిత్స కోసం వాడుతున్నాయి. నిజానికి ఈ ఔషధాన్ని కరోనా చికిత్స కోసం ఉపయోగించకూడదని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయితే యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు.. ఐవర్‌మెక్టిన్‌తో టెస్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 50 ఏళ్ల వయసు దాటిన కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ఐవర్‌మెక్టిన్‌తో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. కోవిడ్ రోగులు ఆస్పత్రిపాలు కాకుండా ఆ ఔషధం ఎంత వరకు రక్షిస్తుందో శాస్త్రవేత్తలు అధ్యయనం చేయనున్నారు.
ఇండియాతో పాటు లాటిన్ అమెరికా, సౌత్ ఆఫ్రికా దేశాల్లో ఐవర్‌మెక్టిన్ ఔషధాన్ని విరివిగా వినియోగించారు. ఎటువంటి ఆధారాలు లేకున్నా.. కోవిడ్ రోగులకు ఆ ఔషధాన్ని ఇచ్చారు. అయితే గతంలో జరిగిన అధ్యయనాలు చాలా స్వల్పంగా ఉన్నాయని, ఇప్పుడు భారీ స్థాయిలో స్టడీ జరగనున్నట్లు ఆక్స్ఫర్డ్ తెలిపింది. యాంటీ పారాసైటిక్ ఔషధమే అయినా.. ఐవర్‌మెక్టిన్ వైరస్‌లను కూడా చంపుతోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ ఇప్పుడే కోవిడ్ చికిత్స కోసం ఐవర్మెక్టిన్ను రికమండ్ చేయలేమని బ్రిటన్ ప్రొఫెసర్ రిచర్డ్ హాబ్స్ తెలిపారు.
ఐవర్‌మెక్టిన్ ఔషధాన్ని బ్రెజిల్, బోలివియా, పెరు, సౌతాఫ్రికా ఇండియా లాంటి దేశాల్లో ఎక్కువ స్థాయిలో వాడారు. క్లినికల్ ట్రయల్స్‌లో తప్ప కొవిడ్ చికిత్సలో ఐవర్మెక్టిన్ను ఉపయోగించవద్దని గతంలో డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్టు సౌమ్యా స్వామినాథన్ సూచించిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

