స్వయంగా యుద్ధ రంగంలోకి దిగిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ? ఫొటో వైరల్
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడో రోజూ బాంబుల మోత కొనసాగుతోంది. పలు నగరాలు, సైనిక స్థావరాలు, ప్రజల నివాసాలపై కూడా రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చెందిన ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీయే స్వయంగా యుద్ధ రంగంలోకి దిగారన్నది ఈ ఫొటో సారాంశం. ఉక్రెయిన్ సైనికులతో కలిసి.. యుద్ధ రంగంలోకి దిగినట్లుగా ఈ ఫొటోలో కనిపిస్తోంది. రష్యా బలగాలు కీవ్ పట్టణానికి అతి సమీపంలోకి వచ్చేశాయన్న వార్తలు ఊపందుకోగానే.. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. ఈ ఫొటోలో జోలోన్స్కీ అచ్చు సైనికుడిలాగే కనపడుతుండటం విశేషం. సైనిక దుస్తులు ధరించి, అచ్చు సైనికుడిలా… ఉంటూ యుద్ధానికి సిద్దమైపోయినట్లు ఇందులో కనిపిస్తుంది.

ఇది నిజమైన ఫొటోయేనా?…
ఇది ఇప్పటి ఫొటో కాదు.. 2021 డిసెంబర్ 6 నాటి ఫొటో ఇది. ఈ తేదీన ఉక్రెయిన్ ఆర్మీడే. దీనిని దృష్టిలో పెట్టుకొని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైనిక దుస్తులు ధరించి, అచ్చు ఓ సైనికుడిలాగానే సైనిక శిబిరాల వద్దకు వెళ్లి.. జవాన్లతో భేటీ అయ్యారు. ఇది అప్పటి ఫొటో.. ఇప్పుడు దీనిని కొందరు వైలర్ చేస్తున్నారు.
తాను కీవ్ నుంచి పారిపోలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. తాను పోరిపోయినట్లు వస్తున్న పుకార్లను ఆయన ఖండించారు. ఆయుధాలు వీడేది లేదని ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు ఒక సెల్ఫీ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నేను ఇక్కడే ఉన్నాను. మేము ఆయుధాలను వీడం. మా దేశాన్ని కాపాడుకుంటాం. మా ఆయుధాలనే నమ్ముకున్నాం. ఆయుధాలు వీడి లొంగిపోవాలంటూ సైన్యానికి నేను చెప్పినట్లుగా నకిలీ వార్తలు వస్తున్నాయి. వాటిని నమ్మవద్దు’ అని ప్రజలనుద్దేశించి అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్పై దాడి..!
రెడ్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

