ఒక్క నిమిషంలో అన్ని చికెన్ నగ్గెట్స్ తినగలరా? ఈ మహిళ ఎన్ని తిన్నదో తెలుసా? వైరల్ వీడియో
నవంబర్ 2020లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చెందిన నేలా జిస్సర్ అనే మోడల్ 298 గ్రాముల నగ్గెట్స్‌ను కేవలం ఒకే నిమిషంలో తినేసింది.
ఎవ్వరూ చేయలేని పనిని చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి ఎక్కొచ్చు. అంటూ.. ఈ ప్రపంచంలో ఉన్న వందల కోట్ల మందిలో ఎవ్వరూ చేయలేని పనిని మీరు చేయగలిగితే.. అది రికార్డు అవుతుంది. అలా ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన వాళ్లు కోకొల్లలు.
తాజాగా ఓ మహిళ ఒక నిమిషంలో ఎవ్వరూ తినలేనన్ని చికెన్ నగ్గెట్స్ తిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. యూకేకు చెందిన లెహ్ షట్కేవర్ గురించే మనం మాట్లాడుకునేది. మెక్ డొనాల్డ్స్‌లో దొరికే ప్రత్యేక స్నాక్ ఐటెమ్ చికెన్ నగ్గెట్స్ ఎంత టేస్టీగా ఉంటాయో అందరికీ తెలుసు. ఒక్క నిమిషంలో ఆ మహిళ 19 నగ్గెట్స్ అంటే 352 గ్రాముల నగ్గెట్స్‌ను తినేసింది. ఒక బౌల్లో 20 నగ్గెట్స్‌ను పెట్టుకొని గబగబా తినడం స్టార్ట్ చేసింది. ఒక్క నిమిషంలో తను 19 నగ్గెట్స్ తినగలిగింది. అయితే.. ఇప్పటి వరకు ఒక్క నిమిషంలో 19 నగ్గెట్స్‌ను ఎవ్వరూ తినలేదు. దీంతో తనకు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కింది. 19 నగ్గెట్స్ 352 గ్రాముల బరువు ఉన్నాయి.
నవంబర్ 2020లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చెందిన నేలా జిస్సర్ అనే మోడల్ 298 గ్రాముల నగ్గెట్స్‌ను కేవలం ఒకే నిమిషంలో తినేసింది. ఆ రికార్డును బ్రేక్ చేసేందుకు లెహ్ ఈ సాహసం చేసింది. అయితే.. లెహ్ ఇదివరకే గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించింది. 3 నిమిషాల్లో 775.1 గ్రాముల చికెన్ నగ్గెట్స్ తిని గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఒక్క నిమిషంలో 352 గ్రాముల నగ్గెట్స్‌ను తినేసింది. ఇవే కాదు.. తన ఖాతాలో ఇంకా చాలా గిన్నిస్ వరల్డ్ రికార్డులు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

