Rishi Sunak | జీహాద్ నినాదాలపై బ్రిటన్ ప్రధాని ఫైర్ : మూల్యం చెల్లించకతప్పదని రిషీ సునాక్ వార్నింగ్
బ్రిటన్ వీధుల్లో జీహాద్ నినాదాలపై యూకే ప్రధాని రిషీ సునాక్ (Rishi Sunak) దీటుగా స్పందించారు. లండన్ ర్యాలీలో జీహాద్ నినాదాలపై ఘాటుగా బదులిచ్చారు.
లండన్ : బ్రిటన్ వీధుల్లో జీహాద్ నినాదాలపై యూకే ప్రధాని రిషీ సునాక్ (Rishi Sunak) దీటుగా స్పందించారు. లండన్ ర్యాలీలో జీహాద్ నినాదాలపై ఘాటుగా బదులిచ్చారు. దేశంలో ఇలాంటి నినాదాలను తాము ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర పోరు సాగుతున్న క్రమంలో బ్రిటన్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
జీహాద్‌కు పిలుపు ఇవ్వడం కేవలం యూధులకు ముప్పు మాత్రమే కాదని, తమ ప్రజాస్వామ్య విలువలకూ విఘాతమని స్పష్టం చేశారు. సెంట్రల్ లండన్‌లో శనివారం దాదాపు లక్ష మంది పాలస్తీనాకు సంఘీభావం ప్రకటిస్తూ ప్రదర్శన చేపట్టారు. వీరంతా ఈ సందర్భంగా జీహాద్ నినాదాలతో హోరెత్తించడం కలకలం రేపింది.
ఈ వారాంతం మన వీధుల్లో విద్వేషం విరజిమ్మడం చూశాం..జీహాద్‌కు పిలుపివ్వడం యూధులకే కాకుండా మన ప్రజాస్వామిక విలువలకూ ముప్పేనని రిషీ సునాక్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. విద్వేష ఉగ్రవాదాన్ని వెదజల్లే వారు చట్టం ఆగ్రహానికి గురికాకతప్పదని నిరసనకారులను ఆయన హెచ్చరించారు. పాలస్తీనాకు అనుకూలంగా చేపట్టిన నిరసనలో జీహాద్ నినాదాలు చేసిన వారిని అరెస్ట్ చేయకపోవడాన్ని మెట్రపాలిటన్ పోలీస్ చీఫ్ సర్ మార్క్ రౌలీ తప్పుపట్టారు.
Read More :
Alaska Airlines | విమానం గాల్లో ఉండగా.. ఇంజిన్లు ఆఫ్ చేసేందుకు యత్నించిన పైలట్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Self Declaration | ఎండితే మా ఖర్మే.. పంటల సాగుపై రైతుల నుంచి సర్కార్ సెల్ఫ్ డిక్లరేషన్
Gen Z Protest | జెన్ జీ దెబ్బకు కూలిన మరో సర్కార్.. సెర్బియాలో దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వూసిచ్ ఓటమిపాలు
Chamala Kiran Kumar Reddy | కన్నెపల్లి నుంచి మేడిగడ్డకు నీళ్లు ఎత్తిపోయాలా.. కాంగ్రెస్ ఎంపీ చామల అజ్ఞానం బట్టబయలు
Tummidihatti | తమ్మిడిహట్టికి కేసీఆర్ విశ్వప్రయత్నం.. మెప్పించి, ఒప్పించేందుకు విశేష కృషి!
Eenadu | చెంపలేసుకున్న ఈనాడు పత్రిక.. కేటీఆర్‌కు క్షమాపణ.. తప్పుడు వార్తకు పత్రిక చరిత్రలో మొదటిసారీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

