ఇక అక్కడ మాస్కులు, వ్యాక్సిన్ సర్టిఫికెట్లు అవసరం లేదు..
Britain | నిర్భంద ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరికాదు, వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేకుండానే ఎక్కడికైనా వెళ్లొచ్చు

లండన్: నిర్భంద ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరికాదు, వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేకుండానే ఎక్కడికైనా వెళ్లొచ్చు. అవును ఇది నిజమే.. ఇదంతా ఎక్కడో కాదు లండన్‌లో. బ్రిటన్‌లో గత రెండు వారాలుగా కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం నుంచి ఒమిక్రాన్ నిబంధనలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. నిర్భంద ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ వంటి నిబంధనల నుంచి ప్రజలకు మినహాయింపునిచ్చారు. దీంతో లండన్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండటంతో ప్రధాని బోరిస్ జాన్సన్ డిసెంబర్ 8న బ్రిటన్‌లో కరోనా ఆంక్షలు విధించారు. నిర్భంద ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేశారు. నైట్ క్లబ్బులు, ఫుట్‌బాల్ స్టేడియాలు, భారీ ఈవెంట్లకు వెళ్లాలంటే వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
అయితే ఒమిక్రాన్ కేసులు తగ్గుతుండటంతో ఈ నిబంధనలు ఎత్తివేశారు. అయినప్పటికీ కరోనా పాజిటివ్‌గా తేలినవారు ఐదు రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని స్పష్టం చేశారు. గతంలో ఇంగ్లండ్‌లో గతేడాది జూలై 19న కరోనా నిబంధనలు పూర్తి ఎత్తివేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

