Norovirus | యూకేను వణికిస్తున్న నోరోవైరస్.. ఏంటిది? ఎలా వ్యాపిస్తుంది?
Norovirus | ఈ నోరోవైరస్ బారిన పడి వాళ్లలో చాలా మందికి చికిత్స అవసరం లేదు.. కానీ వృద్ధులు, చిన్న పిల్లలు, ఇప్పటికే అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్లలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

లండన్: వైరస్లు మానవాళిని వదిలా లేవు. కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుండగానే చైనాలో మంకీ బీ అనే మరో వైరస్ కనిపించిందని, ఒకరు మృత్యువాత పడ్డారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో మరో వైరస్ వణికిస్తోంది. నోరోవైరస్ ( norovirus )గా పిలుస్తున్న దీనిని వామిటింగ్ బగ్ అని కూడా అంటున్నారు. ఇంగ్లండ్ దేశవ్యాప్తంగా ఈ నోరోవైరస్ కేసులు కనిపించినట్లు పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (పీహెచ్ఈ) వెల్లడించింది.
ఏంటీ Norovirus ?
ఇది చాలా వేగంగా వ్యాపించే వైరస్. అమెరికాలో ఆహారం కారణంగా వచ్చే వ్యాధుల్లో సగం ఈ వైరస్ కారణంగానే వస్తున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. ఈ నోరోవైరస్నే స్టమక్ ఫ్లూ అని, ఫుడ్ పాయిజనింగ్ అని, స్టమక్ బగ్ అనీ పిలుస్తుంటరని చెప్పింది. ఇది ఇన్ఫ్లుయెంజా కారణంగా వచ్చే సీజనల్ వ్యాధి కాదు.
నోరోవైరస్ లక్షణాలేంటి?
ఈ వైరస్ సోకిన 12 నుంచి 48 గంటల్లోపు తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఒకటి నుంచి మూడు రోజుల పాటు ఉంటుంది. ఈ వైరస్ సోకితే డయేరియా, కడుపు నొప్పి, వికారం, వాంతులు, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి నోరోవైరస్ సోకినా ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించవని మేయో క్లినిక్ వెల్లడించింది.
ఇది ఎంత ప్రమాదకరం?
వైరస్ సోకిన వ్యక్తుల మలం, వాంతిలో ఈ norovirus ఉంటుంది. ఇవి స్వల్ప పరిమాణంలో లోనికి వెళ్లినా వైరస్ బారిన పడతారు. కలుషితమైన నీళ్లు, ఆహారాన్ని సిద్ధం చేసే ముందు సరిగా కడగకపోవడం, కలుషితమైన ఉపరితలంపై ఈ వైరస్ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు వందల కోట్ల నోరోవైరస్ అణువులను బయటకు రిలీజ్ చేయగలరు. ఇందులో స్వల్ప మొత్తం కూడా ఇతర వ్యక్తులను అనారోగ్యానికి గురి చేయగలదని సీడీసీ తెలిపింది.
ఎలా సోకుతుంది?
నోరోవైరస్‌తో కలుషితమైన ఆహారాన్ని తిన్నప్పుడు, ద్రవాలను తాగినప్పుడు ఈ వైరస్ సోకుతుంది. ఈ వైరస్ ఉన్న ఏదైనా వస్తువు, ఉపరితలాన్ని తాకి, అదే చేత్తో నోటిని తాకినప్పుడు కూడా వైరస్ లోనికి వెళ్తుంది. ఇక ఈ వైరస్ సోకిన వ్యక్తితో ఆహారం పంచుకోవడం, వాళ్లు వాడిన పాత్రలను వాడటం వల్ల కూడా ఈ వైరస్ బారిన పడవచ్చు. సరిగా శుభ్రం చేయని బావిలోని కలుషిత నీటిని తాగినా కూడా ఈ వైరస్ వస్తుంది.
ఎలా గుర్తిస్తారు?
సాధారణంగా వ్యక్తి లక్షణాలతో డాక్టర్లు ఈ norovirusను గుర్తించగలరు. లేదంటే వ్యక్తి మలాన్ని పరీక్షించడం ద్వారా కూడా వైరస్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఏవైనా అనారోగ్య సమస్యలు లేదా రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వ్యక్తుల మలాన్ని పరీక్షలకు పంపాల్సిందిగా డాక్టర్లు సూచించవచ్చు.
చికిత్స ఏంటి?
ఈ నోరోవైరస్ బారిన పడి వాళ్లలో చాలా మంది ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకునే అవకాశాలు ఉంటాయి. అయితే వృద్ధులు, చిన్న పిల్లలు, ఇప్పటికే అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్లలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్లకు చికిత్స తప్పనిసరి. ఒక్కోసారి హాస్పిటల్లోనూ అడ్మిట్ కావాల్సి వస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వాళ్లకు ఒకటి నుంచి మూడు రోజుల్లో నయమవుతుంది.
norovirusలో చాలా రకాలు ఉన్నాయి. అందువల్ల ఇది ఒకసారి సోకిన వ్యక్తులు మళ్లీ మళ్లీ కూడా దీని బారిన పడే అవకాశాలు ఉంటాయి. కొందరిలో కొన్ని రకాల నోరోవైరస్‌కు తగిన రోగనిరోధక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. అయితే ఇది ఎన్ని రోజులు ఉంటుందన్నదానిపై స్పష్టత లేదు.
ఇవి కూడా చదవండి..
చైనాలో కొత్త వైరస్.. ఏంటిది? మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందా?
డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్లు పనిచేస్తాయా? ఐసీఎంఆర్ అధ్యయనంలో ఏం తేలింది?
Pegasus spyware | మంత్రుల ఫోన్ హ్యాకింగ్.. అసలేంటీ పెగాసస్ స్పైవేర్? ఎలా హ్యాక్ చేస్తుంది?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

