UAE | యూఏఈ సంచలన నిర్ణయం.. ఒపెక్ దేశాల కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన
UAE | యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (UAE) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒపెక్ (OPEC), ఒపెక్ ప్లస్ (OPEC+) దేశాల కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మే 1వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే చమురు ఎగుమతి దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియా (Saudi Arabia) కు యూఏఈ నిర్ణయం పెద్ద దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
UAE : యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (UAE) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒపెక్ (OPEC), ఒపెక్ ప్లస్ (OPEC+) దేశాల కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మే 1వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే చమురు ఎగుమతి దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియా (Saudi Arabia) కు యూఏఈ నిర్ణయం పెద్ద దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (OPEC) లో చాలా ఏళ్లుగా యూఏఈ సభ్యదేశంగా ఉంది. ఒపెక్ ఏర్పాటైన ఏడేళ్ల తర్వాత 1967లో యూఏఈ ఇందులో చేరింది. సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. ఒపెక్ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నది. సుదీర్ఘకాలం పాటు సభ్యదేశంగా కొనసాగిన యూఏఈ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కూటమి నుంచి బయటకు రావడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. అయితే తమ దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇదిలావుంటే భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్పత్తి పెంపు విషయంలో తలెత్తిన అంతర్గత విబేధాల కారణంగానే యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తోంది. ఇరాన్ దాడుల విషయంలో సౌదీ అరేబియా, ప్రాంతీయ మిత్ర దేశాలు సరైన విధంగా స్పందించకపోవడంపై యూఏఈ ఇప్పటికే అసంతృప్తితో ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

