చైనాలో ‘బెబింకా’ బీభత్సం
గత 75 ఏండ్లలో ఎన్నడూ లేనంత భీకరమైన తుఫాన్ చైనాను తాకింది. సోమవారం ఉదయం టైఫూన్ ‘బెబింకా’ చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో తీరాన్ని దాటింది. దాదాపు 2.5 కోట్ల జనాభా కలిగిన షాంఘై నగర జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఇక్కడి జాతీయ రహదారుల్ని మూసేయించారు.
బీజింగ్, సెప్టెంబర్ 16: గత 75 ఏండ్లలో ఎన్నడూ లేనంత భీకరమైన తుఫాన్ చైనాను తాకింది. సోమవారం ఉదయం టైఫూన్ ‘బెబింకా’ చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో తీరాన్ని దాటింది. దాదాపు 2.5 కోట్ల జనాభా కలిగిన షాంఘై నగర జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఇక్కడి జాతీయ రహదారుల్ని మూసేయించారు. షాంఘైలో రెండు విమానాశ్రాయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలన్నీ రద్దయ్యాయి. విమాన ప్రయాణికులకు తాత్కాలిక బస ఏర్పాటుచేసినట్టు అధికారులు ప్రకటించారు. ఆది, సోమ రెండు రోజులపాటు షాంఘై రైల్వే స్టేషన్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. తూర్పు చైనాలోని అహూయి ప్రావిన్స్‌కు లెవల్-4 స్థాయి, షాంఘై, ఝిజియాంగ్ నగరాలకు లెవల్-3 ప్రమాద హెచ్చరికలు జారీచేసినట్టు ‘జిన్హువా’ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో 4,14,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

