Eiffel tower | తాగిన మత్తులో రాత్రంతా ఈఫిల్ టవర్‌పైనే.. ఇద్దరు అమెరికన్ టూరిస్టుల అరెస్ట్
Eiffel tower | అమెరికాకు చెందిన ఇద్దరు టూరిస్టులు పూటుగా మద్యం సేవించి ఆగస్టు 13న రాత్రి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌పైకి ఎక్కారు. తాగిన మైకంలో అత్యంత ఎత్తులో ఉన్న, పర్యాటకులకు అనుమతిలేని ప్రదేశానికి వారు చేరుకున్నారు.
పారిస్: అమెరికాకు చెందిన ఇద్దరు టూరిస్టులు పూటుగా మద్యం సేవించి ఆగస్టు 13న రాత్రి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌పైకి ఎక్కారు. తాగిన మైకంలో అత్యంత ఎత్తులో ఉన్న, పర్యాటకులకు అనుమతిలేని ప్రదేశానికి వారు చేరుకున్నారు. టవర్ మూసివేత సమయంలో భద్రతా సిబ్బంది పర్యాటకులు అందరినీ కిందకు దించినప్పటికీ నిషిద్ధ ప్రాంతంలోకి వెళ్లిన ఆ ఇద్దరిని గమనించలేదు. దాంతో ఆ ఇద్దరు అమెరికన్ టూరిస్టులు రాత్రంతా ఈఫిల్ టవర్‌పైనే పడుకున్నారు.
మరుసటి రోజు ఉదయం 9.00 గంటలకు టవర్ తెరిచేముందు భద్రతా సిబ్బంది గస్తీ తిరుగుతుండగా పైన నిషేధిత ప్రాంతంలో ఆ టూరిస్టులిద్దరూ పడుకుని ఉండటం గమనించారు. దాంతో షాకైన సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఫైర్‌పైటర్లు, రెస్క్యూ సిబ్బందిని రప్పించి వారిని సురక్షితంగా కిందికి దించారు. అనంతరం పారిస్ పోలీసులు ఆ ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఈ ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నిర్మాణాన్ని 1887లో మొదలుపెట్టి 1889 మార్చి 31న పూర్తిచేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ప్రపంచ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో పర్యాటకులు ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఈ ఈఫిల్ టవర్‌ను సందర్శిస్తున్నారు. 2022 సంవత్సరంలో 62 లక్షల మందికి పైగా పర్యాటకులు ఈఫిల్ టవర్‌ను సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

