కొన్ని నిమిషాల తేడాతో.. వేర్వేరు తేదీలు, నెలలు, సంవత్సరాల్లో పుట్టిన కవలలు
ఆరు నిమిషాల తేడాతో వేర్వేరు తేదీలు, వేర్వేరు నెలలు, వేర్వేరు సంవత్సరాల్లో కవల పిల్లలు పుట్టడంపై కాలీ జో, క్లిఫ్ జంట ఆనందానికి అంతులేకుండా పోయింది.
వాషింగ్టన్: కవల పిల్లలు కొన్ని నిమిషాల తేడాతో వేర్వేరు తేదీలు, వేర్వేరు నెలలు, వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ వింత సంఘటన జరిగింది. కాలీ జో, క్లిఫ్ జంటకు అరుదైన సమయంలో కవల పాపలు పుట్టారు. 2022 డిసెంబర్ 31న రాత్రి 11.55 గంటలకు మొదటి పాప అన్నీ జోకు కాలీ జో జన్మనిచ్చింది. అనంతరం కొత్త ఏడాది జనవరి 1న 12.01 గంటలకు ఈఫీ రోజ్ స్కాట్ అనే రెండో పాప పుట్టింది.
కాగా, ఆరు నిమిషాల తేడాతో వేర్వేరు తేదీలు, వేర్వేరు నెలలు, వేర్వేరు సంవత్సరాల్లో కవల పిల్లలు పుట్టడంపై కాలీ జో, క్లిఫ్ జంట ఆనందానికి అంతులేకుండా పోయింది. తమ సంతోషాన్ని ఫేస్బుక్లో వారు పంచుకున్నారు. ‘అన్నీ జో, ఈఫీ రోజ్ స్కాట్లను పరిచయం చేయడం నేను, క్లిఫ్ చాలా గర్వంగా ఫీలవుతున్నాం’ అని కాలీ జో పేర్కొంది.
2022 డిసెంబర్ 31న రాత్రి 11:55 గంటలకు జన్మించిన చివరి పాప అన్నీ అని, 2023 జనవరి 1న ఉదయం 12:01 గంటలకు మొట్టమొదటిసారిగా జన్మించిన పాప ఈఫీ రోజ్ అని కాలీ జో తెలిపింది. వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, 5.5 పౌండ్లు బరువు ఉన్నట్లు వెల్లడించింది. అరుదైన సమయంలో కవలలకు జన్మనివ్వడం తమకు చాలా ఆశ్చర్యంగాను, చాలా సంతోషంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ఆమె పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

