Israel-Hamas War | టెర్రర్ టన్నెల్.. ఇజ్రాయెల్‌కు సవాల్‌గా గాజాలోని సొరంగాలు
గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ చేసేందుకు ఇజ్రాయెల్ దళాలు సన్నద్ధమవుతున్నాయి. అయితే గాజాలో ఉన్న టన్నెల్ నెట్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకొని ఇజ్రాయెల్ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Israel-Hamas War | జెరూసలేం, అక్టోబర్ 14: గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ చేసేందుకు ఇజ్రాయెల్ దళాలు సన్నద్ధమవుతున్నాయి. అయితే గాజాలో ఉన్న టన్నెల్ నెట్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకొని ఇజ్రాయెల్ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరైన ప్రణాళిక లేకుండా టన్నెళ్లలో ప్రవేశిస్తే ట్రాప్‌లో ఇరుక్కున్నట్టేనని వారు హెచ్చరిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. గాజా టన్నెల్ నెట్వర్క్ ఎంత భయంకరమైనదో. తమ ఎటాక్ ప్లాన్ కంటే డిఫెన్స్ ప్లానే అత్యంత పటిష్ఠంగా ఉందని హమాస్ పొలిట్‌బ్యూరో డిప్యూటీ చీఫ్ సలేహ్ అల్ అరౌరీ పేర్కొనడమే అందుకు నిదర్శనం.
500 కిలోమీటర్ల నెట్వర్క్…
గాజాలో సుమారు 500 కిలోమీటర్ల మేర ఉన్న టన్నెళ్లలో బాంబులు, బందీలను హమాస్ రహస్యంగా ఉంచుతున్నది. వీటి ద్వారానే హమాస్ మిలిటెంట్లు తాజాగా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2006లో సరిహద్దుల కింద ఉన్న సొరంగాల ద్వారా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన మిలిటెంట్లు ఇద్దరు సైనికులను హతమార్చారు. సొరంగాల్లో ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులను హమాస్ ట్రాప్ చేసి హతమారుస్తున్నది. టన్నెళ్లలోకి వెళ్లాక ఎటు వెళ్లాలో అవగాహన లేకపోవడమే ఇజ్రాయెల్‌కు ప్రతికూలంగా మారుతున్నది. టెర్రర్ టన్నెళ్లుగా ఇజ్రాయెల్ పిలుచుకునే వీటిని ధ్వంసం చేయకుండా హమాస్‌ను అంతం చేయడం సవాల్‌గానే చెప్పుకోవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

