Donald Trump | పిరికిపందలు.. మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం..!
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి నాటో(NATO) సభ్య దేశాలపై మండిపడ్డారు.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి నాటో(NATO) సభ్య దేశాలపై మండిపడ్డారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడానికి తమతో కలిసి రానందుకు నాటోను ఒకే వైపున్న వీధిగా అభివర్ణించిన ట్రంప్.. ఈసారి పిరికిపందలుగా పేర్కొన్నారు. శుక్రవారం తన సోషల్ మీడియా పోస్టుల్లో పిరికిపందలారా.. మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం అని నాటో దేశాలపై ట్రంప్ తన అక్కసు వెళ్లగక్కారు.
ఇజ్రాయేల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధానికి దిగిన డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రపంచ దేశాల నుంచి మద్ధతు కరువవుతోంది. అంతర్జాతీయ జల రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడంలో నాటో దేశాల సాయం కోరిన అమెరికా అధ్యక్షుడికి చుక్కెదురైంది. ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో తాము పాల్గొనబోమని ఆయా దేశాలు స్పష్టం చేశాయి. దాంతో, చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ మాకు ఎవరి సాయం అక్కర్లేదు అని నాటో దేశాలకు తేల్చి చెప్పారు. చమురు ధరలు పెరుగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఈ దేశాలపై శుక్రవారం మరోసారి ట్రంప్ విరుచుకుపడ్డారు.
( @realDonaldTrump – Truth Social Post )
( Donald J. Trump – Mar 20 2026, 8:43 AM ET )Without the U.S.A., NATO IS A PAPER TIGER!
They didn’t want to join the fight to stop a Nuclear Powered Iran. Now that fight is Militarily WON, with very little danger for them, they… pic.twitter.com/iDO1RbSTkO— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) March 20, 2026
‘చమురు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని నాటో దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ, హర్మూజ్ జల సంధిని తెరచి ఉంచేందుకు మాత్రం మాతో కలిసి రావడం లేదు. అమెరికా లేకుండా నాటో సంస్థ కాగితంపై మాత్రమే పులి’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. జపాన్ సహా కొన్ని యూరోపియన్ దేశాలు మాత్రం హర్మూజ్ జలసంధిని సంరిక్షించేందుకు ముందుకొచ్చాయి.
‘నాటోలోని కొన్ని దేశాల రక్షణ కోసం అమెరికా ఏటా కొన్ని వందల కొద్ది బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. కానీ, బదులుగా అమెరికాకు ఈ దేశాలు ఏమీ చేయడం లేదు. ఇరాన్ సైన్యాన్ని అమెరికా నాశనం చేసింది. ఆ దేశ నావికా దళం, వాయుసేన, నాయకత్వాన్ని దెబ్బతీశాం. ఇప్పటివరకూ ప్రపంచంలోనే అమెరికా శక్తివంతమైన దేశం. మాతో కలిసి వచ్చేందుకు నిరాకరిస్తున్న నాటో దేశాలు చాలా తెలివితక్కువ పొరపాటు చేస్తున్నాయి.
President Trump on NATO: They don’t want to help us defend the Strait and they’re the ones that need it.
Now they’re getting much nicer because they’re seeing my attitude. But as far as I’m concerned it’s too late. pic.twitter.com/Wz1i5h5pDJ
— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) March 19, 2026
ఒకవేళ ఈ దేశాలు అంగీకరించినా ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకునేందుకు, కీలకమైన జల రవాణాను ఏర్పరచుకునేందుకు మేము అనుమతించే వాళ్లం కాదు’ అని ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే ఇరాన్‌పై దాడుల్లో అమెరికా సైన్యం విజయవంతమైందని, తమకు నాటో దేశాల సాయం అవసరం లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. అంతేకాదు తమకు జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా సైతం సాయం చేయనక్కర్లేదని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

