న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump).. హష్ మనీ కేసులో తొలుత సరెండర్ అయి ఆ తర్వాత రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బిజినెస్ రికార్డు(Business Records)లను మోసం చేసిన కేసులో ట్రంప్‌పై 34 నేరాభియోగాలు నమోదు అయ్యాయి. ఒకవేళ ఆ కేసుల్లో ట్రంప్ దోషిగా తేలితే, దాదాపు 136 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఒకవేళ ట్రంప్ దోషిగా తేలినా.. అంత శిక్ష వేయకపోవచ్చు అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
పోర్న్ స్టార్(porn star) స్టార్మీ డేనియల్స్‌కు లక్షా 30 వేల డాలర్లు చెల్లించిన అంశంలో.. ఆ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ట్రంప్ తన బిజినెస్ రికార్డులను మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిలో భాగంగానే ఎన్నికల చట్టాలను కూడా మార్చే ఆలోచన చేసినట్లు న్యాయవాది ఆరోపించారు. ఆ హష్ మనీ వివరాల్ని దాచిపెట్టేందుకు ట్రంప్ 34 తప్పుడు ఎంట్రీలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.