కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి(helicopter crash). అటవి మంటల్ని ఆర్పేందుకు రంగంలోకి దిగిన ఆ హెలికాప్టర్లు గాలిలోనే ఢీకొన్నాయి. రివర్సైడ్ కౌంటీలోని కేబజాన్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగంది. రెండు హెలికాప్టర్లు ఢీకొన్న సమయంలో.. ఒకటి క్షేమంగా కిందకు దిగింది. మరో హెలికాప్టర్ దిగే సమయంలో కూలింది. అయితే ఆ హెలికాప్టర్లో ఉన్న ముగ్గురు మరణించారు. ఈ ఘటన పట్ల విచారణకు ఆదేశించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెందిన ఫైర్ కెప్టెన్‌తో పాటు ఫైర్ ఆఫీసర్, పైలెట్ మృతిచెందారు. ఇదో విషాదకర ఘటన అని అగ్నిమాపక శాఖ తెలిపింది.