Israel Protests: రక్షణ మంత్రి తొలగింపు.. ఇజ్రాయిల్‌లో భారీ నిరసన ప్రదర్శనలు
Israel protests: జుడిషియల్ సంస్కరణలు చేపట్టాలని ప్రధాని బెంజిమన్ నెతన్యూ చేసిన ప్రతిపాదనను రక్షణ మంత్రి వ్యతిరేకించారు. దీంతో మంత్రి గాలెంట్‌ను తొలగించారు. ఈ నేపథ్యంలో ప్రజలు భారీ సంఖ్యలో నిరసన ప్రదర్శన చేపడుతున్నారు.
టెల్ అవివ్: ఇజ్రాయిల్(Israel)లో వేల సంఖ్యలో జనం నిరసన(protest) ప్రదర్శన చేపడుతున్నారు. ఆ దేశ రక్షణ మంత్రి యోవా గాలెంట్(Yoav Gallant)ను ప్రధాని బెంజిమెన్ నెతాన్యూ తొలగించారు. దీంతో ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. న్యాయ వ్యవస్థను మార్చాలని నెతాన్యూ(Netanyahu) చేసిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా రక్షణ మంత్రి మాట్లాడారు. దీంతో ఆయన్ను క్యాబినెట్ నుంచి ప్రధాని తొలగించారు. జెరుసలాంలో జరిగిన ప్రదర్శనలో పోలీసులు, సైనికులు వాటర్ క్యానన్లతో నిరసనకారుల్ని చెదరగొట్టారు.
న్యాయ వ్యవస్థ(judicial system)లో చేపట్టాలనుకుంటున్న సంస్కరణల(reforms)ను ఆపివేయాలని ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఇజాక్ హెర్జోగ్ పిలుపునిచ్చారు. కొత్త చట్టాల సంస్కరణల ప్రకారం.. జడ్జిల నియామకం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఈ విషయంలో వ్యతిరేక వ్యక్తం అవుతోంది. కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జోరందుకున్నాయి. అన్‌ఫిట్‌గా తేలిన నాయకున్ని తొలగించాలన్న నిబంధనలను కూడా మార్చనున్నారు.
అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంజిమన్ నెతన్యూ చట్టాల మార్పుతో శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేపడుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

