కోలంబస్: అమెరికాలోని కొలంబస్ జూలో కొన్నేండ్ల పాటు మగదిగా భావించిన ఒక గొరిల్లా హఠాత్తుగా ఓ బిడ్డకు జన్మనిచ్చి అధికారులకు షాక్ ఇచ్చింది. సల్లీగా పిలిచే ఆ మగ గొరిల్లా బిడ్డను కనడమేమిటి? అది గర్భంతో ఉన్న ఛాయలు కూడా లేవు కదా! అని ఆశ్చర్యపోయారు. జూలో 2019 నుంచి ఉన్న అ గొరిల్లా ఇన్నాళ్లు అనుకున్నట్టు మగది కాదు ఆడదని తెలుసుకొని షాక్ తిన్నారు. తర్వాత తమ తప్పునకు నాలిక కరుచుకుని.. ఏదిఏమైనా జూలోకి మరో చిన్నారి గొరిల్లా అడుగుపెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జూ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ సాధారణంగా ఆడ, మగ గొరిల్లాలు సైజులో ఒకే విధంగా ఉంటాయని, వాటిలోని తేడాను గుర్తించడానికి ప్రత్యేక శరీర అవయవాల నిర్మాణం ఉండదని పేర్కొన్నారు.