Goal: ఫుట్‌బాల్ చరిత్రలోనే ఇది లాంగెస్ట్ రేంజ్ గోల్.. వీడియో
Goal:101 మీటర్ల దూరం నుంచి గోల్ కొట్టాడు గోల్ కీపర్. ఫుట్‌బాల్ చరిత్రలో ఇది లాంగెస్ట్ రేంజ్ గోల్‌గా రికార్డుకానున్నది. ఈ ఘటన చిలీలో జరుగుతున్న సాకర్ టోర్నీలో చోటుచేసుకున్నది.
చిలీ: చిలీ(Chile) దేశంలో జరుగుతున్న సాకర్ లీగ్(Soccer league)లో ఓ అద్భుత ఘటన చోటుచేసుకున్నది. కోబ్రెసాల్, కోలోకోల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ రికార్డు నమోదు అయ్యింది. కోబ్రెసాల్ జట్టు గోల్‌కీపర్ లియాండ్రో రెక్వినా(Requena) .. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత దూరం నుంచి గోల్(goal) కొట్టాడు. ఆట 77వ నిమిషంలో 2-0 గోల్స్ తేడాతో కోబ్రెసాల్ జట్టు లీడింగ్‌లో ఉన్న సమయంలో ఓ అద్భుతం జరిగింది. గోల్ కిక్ పోస్టు నుంచి రెక్వినా .. ప్రత్యర్థి గోల్ పోస్టు దిశగా కిక్(kick) కొట్టాడు. అయితే ఆ బంతి కోలో కోలో గోల్కీపర్ను దాటేసి నేరుగా గోల్ అయ్యింది. పెనాల్టీ ఏరియా బయట ఉన్న గోల్‌కీపర్ బ్రయాన్ కోర్టిస్ ఆ బంతిని పట్టుకోలేకపోయాడు. స్టెప్ తిన్న తర్వాత అది బౌన్స్ అయ్యింది. గోల్ దిశగా వెళ్తున్నా.. అతను ఆ బంతిని అందుకోలేకపోయాడు.
⚽⚪🟠 El primer gol arco a arco del #CampeonatoBetsson
Así fue la anotación de Leandro Requena desde su propia puerta y que dejó a Brayan Cortés quieto, provocando el error del portero albo en el #CSLvsCCxTNTSports. pic.twitter.com/HDL2K22QnS
— TNT Sports Chile (@TNTSportsCL) March 18, 2023
అయితే ఈ గోల్‌ను సుమారు 101 మీటర్ల దూరం నుంచి రెక్వినా కొట్టాడు. ఒకవేళ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్(Guinness World Records)లో ఈ గోల్ ఎక్కితే, అప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే ఇది లాంగెస్ట్ రేంజ్ గోల్ అవుతుంది. గతంలో 2021లో ఇంగ్లండ్‌లో జరిగిన ఓ మ్యాచ్ లో టామ్ కింగ్ సుమారు 96.01 మీటర్ల దూరం నుంచి గోల్ చేశాడు. ఇప్పుడు ఆ దూరాన్ని రెక్వినా బ్రేక్ చేశాడు. లాంగెస్ట్ గోల్ గురించి గిన్నిస్ రికార్డుకు దరఖాస్తు చేసుకోనున్నట్లు ప్లేయర్ తెలిపాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

