ప్రతి రోజూ వాడే ఈ కెమికల్‌తో ఏటా లక్ష మంది మృతి.. ఏంటిది? ఎంత ప్రమాదం?
దీని పేరు థాలెట్స్( phthalates ). ఇది ఒక రసాయనాల సమూహం. దీనిని మనం వాడే ప్లాస్టిక్ నుంచి మేకప్ సామగ్రి వరకూ చాలా వాటిలో వినియోగిస్తారు.

న్యూయార్క్: మనం రోజూ వాడే వస్తువుల్లో ఉండే కెమికల్ అది. ఏదో రూపంలో మన శరీరంలోకి వెళ్తూనే ఉంటుంది. ఆ కెమెకిల్ కారణంగా అమెరికాలో ప్రతి ఏటా లక్ష మంది మరణిస్తున్నట్లు తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. న్యూయార్క్ యూనివర్సిటీ చేసిన ఈ అధ్యయనం ఆ కెమికల్ గురించి ఆందోళన కలిగించే విషయాలు వెల్లడించింది.
ఇంతకీ ఏంటా కెమికల్?
దీని పేరు థాలెట్స్( phthalates ). ఇది ఒక రసాయనాల సమూహం. దీనిని మనం వాడే ప్లాస్టిక్ నుంచి మేకప్ సామగ్రి వరకూ చాలా వాటిలో వినియోగిస్తారు. బొమ్మలు, బట్టలు, షాంపోలు వంటి ప్రతి రోజూ వాడే వస్తువుల్లో ఈ థాలెట్లు ఉంటాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ కెమికల్‌కు హార్మోన్లకు భంగం కలిగిస్తుందన్న పేరుంది. ఇది ఓ వ్యక్తి ఎండోక్రైన్ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి వస్తువుల కారణంగా ఈ విష పదార్థాలు శరీరంలోకి ప్రవేశిస్తాయని సదరు అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయన ఫలితాలను ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జర్నల్‌లో ప్రచురించారు.
ఎంతమందిపై అధ్యయనం?
న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన గ్రాస్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఈ అధ్యయనం నిర్వహించింది. ఇందులో భాగంగా 55 నుంచి 64 ఏళ్ల మధ్య వయసున్న 5 వేల మందిని పరిశీలించారు. వాళ్ల యూరిన్‌లో థాలెట్ల గాఢత ఎక్కువగా ఉన్న వాళ్లలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. ఈ గుండె జబ్బుల కారణంగానే వాళ్లు చనిపోతున్నారని అధ్యయనం తేల్చింది. థాలెట్లు నేరుగా మరణానికి కారణం కాకపోయినా.. గుండె జబ్బులకు కారణమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఎక్కువ కాలం పాటు థాలెట్లు శరీరంలోకి ప్రవేశించడం వల్ల అది గుండె జబ్బులకు దారితీసి అకాల మరణాలు సంభవిస్తున్నట్లు ఈ అధ్యయనం నిర్వహించిన బృందానికి హెడ్ లియొనార్డో ట్రాసండె వెల్లడించారు. థాలెట్ల వల్ల తాము ముందుగా అనుకున్న దాని కంటే ఎక్కువ ప్రమాదమే ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ థాలెట్ల వల్ల అమెరికాకు ప్రతి ఏటా 4 వేల కోట్ల నుంచి 4.7 వేల కోట్ల డాలర్ల వరకూ ఆర్థిక నష్టం వస్తుందనీ ఈ అధ్యయనం తేల్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

